మాజీ సీఎం వైఎస్ జగన్ భవిష్యత్తులో అధికారంలోకి వస్తారేమో అని కొంతమంది భావిస్తున్నా ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు చేసే పనుల వల్ల జగన్ కు మళ్లీ అధికారం దక్కడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సొంత పార్టీ ఛానల్ జగన్ ను ముంచేస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
ఎవరో చేసిన తప్పులకు జగన్ బాధ్యత వహించాల్సిన పరిస్థితి నెలకొంది. జగన్ నమ్మిన వ్యక్తులు పార్టీకి తీరని చేటు చేస్తున్నారు. వాళ్లు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో చెప్పలేం కానీ వైసీపీపై మాత్రం ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒక జర్నలిస్ట్ చేసిన నీచ వ్యాఖ్యల వల్ల జగన్ ఆయన భార్య ప్రస్తుతం మీడియాకు టార్గెట్ అవుతుండటం సోషల్ మీడియాలో సంచలనం అవుతోంది.
 
సాక్షి టీవీ కేంద్రంగా జర్నలిస్ట్ మాట్లాడిన మాటలు ప్రసారం కావడం హాట్ టాపిక్ అవుతోంది. జగన్ ను ముంచేస్తున్న సొంత పార్టీ ఛానల్ అని వైసీపీ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. జర్నలిస్ట్ నోరు పారేసుకోవడం సంచలనం అవుతోంది. ఈ వివాదం విషయంలో సాక్షి ఛానల్ యాజమాన్యం స్పందన ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి.
 
కూటమి అనుకూల మీడియా జగన్ కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ కొంతమంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను కథనాలను ప్రచారం చేస్తోంది. జగన్ ఈ ఘటన గురించి రియాక్ట్ అయితే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన విషయంలో జగన్ మనసులో ఏముందో తెలియాల్సి ఉంది. ఈ తరహా వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. పార్టీకి నష్టం చేస్తున్న వ్యక్తుల విషయంలో జగన్ సైతం కఠిన చర్యలు తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: