
అలాంటి వ్యక్తులను నడిరోడ్డు మీద కొట్టడం, పబ్లిక్ ఇవాళ ఇన్స్టంట్ జస్టిస్ కోరుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ సక్సెస్ అవుతున్నారంటే అక్కడ ఎప్పటికప్పుడు తప్పు చేసిన వారిని చితకబాదుతున్నారు కాబట్టే.. ఇక జనాలలో కూడా తప్పు ఎక్కడైనా జరిగితే వెంటనే భాదాలని కోరిక కూడా ఉన్నది. అలాంటి సందర్భాలలో పోలీసులు ఆ మనోభావాలకు అనుగుణంగానే వాళ్లను కొట్టారు.. అయితే ఇందులో ఓసీలను కొడతారా ?బీసీలను కొడతారా? ఎస్సీలను కొడతారా? ఇలాంటి కాన్సెప్టులు పనికొస్తాయా?.. అక్కడికి వెళ్లి వాళ్ళని పరామర్శించడం కరెక్టేనా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
రెండవ అంశం ఏమిటంటే తాజాగా సాక్షి ఛానల్ లో డిబేట్ సందర్భంగా పెట్టిన కృష్ణరాజు గారు మాట్లాడినటువంటి మాటలు తప్పు.. అయితే ఆయన అప్పుడే క్షమాపణలు చెప్పి ఉండాలా లేకపోతే లైవ్ లోనే విత్ డ్రా చేసుకొని ఉండాలి.. అలాగే ఆ డిబేట్ చేసినటువంటి కొమ్మినేని క్షమాపణలు చెప్పి ఉండాలి డిబేట్లో అప్పుడే తప్పని చెప్పి ఉండాలి. అక్కడ ఇద్దరూ కూడా ఆ మాట చెప్పలేదు..ఆ తర్వాత కేసు రాష్ట్రమంతా కూడా ఫైర్ అవుతున్న వేళ..ఇది మాకేంటి సంబంధం అంటూ సాక్షి తరుపున వైసీపీ ప్రశ్నించింది. కృష్ణంరాజుది కూడా తప్పే అని వారు కూడా అంగీకరించారు. ఇలాంటి సందర్భంలోనే సాక్షి కార్యాలయం మీద దాడులు కూడా చేశారు..
ఇక తాజాగా కొమ్మినేని అరెస్టు పైన వైసీపీ నేతలలో ఒకరైన సజ్జల రామకృష్ణ స్పందించడం ఒక ఎత్తు అయితే.. జగన్ స్పందిస్తూ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించడం మరో ఎత్తు..అసలు యాంకర్ కి ఏంటి సంబంధం అనే ప్రశ్న అని కూడా రైజ్ చేశారు. ముందు మహిళలకు సంబంధించి విషయం పైన మాట్లాడి ఆ తర్వాత ప్రశ్నలు రైజ్ చేయాల్సింది.. మరి ఈ విషయాలపై ఏం జరుగుతుందో చూడాలి.