
కేటీఆర్, రేవంత్ రెడ్డి పరిపాలనా వైఫల్యాలను ఎత్తిచూపారు. హామీలను నెరవేర్చే దమ్ము లేక, దద్దమ్మ రాజకీయాలతో తప్పించుకుంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కేసీఆర్, హరీశ్ రావును కూడా పిలిచారని, తనను జైల్లో పెట్టి కాంగ్రెస్ నాయకులు పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. అరెస్ట్ చేసినా, 1400 కేసులు పెట్టినా తాను భయపడనని, జైల్లో విశ్రాంతి తీసుకుంటానని వ్యంగ్యంగా అన్నారు. ఏసీబీ అధికారులు పైనుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారని దుయ్యబట్టారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను చిత్తుగా ఓడిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతికి అంకితమై ఆరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, దాని గొప్పతనాన్ని చాటే కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ వివాదంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. కేటీఆర్ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి. ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు