పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు .. అయితే ఆసిమ్‌ రెచ్చగొట్టడంతోనే పహాల్గామ్ ఉగ్ర‌ దాడిలో 26 మంది భారతీయులు చనిపోయారు ఈ ఘటనను ప్రపంచ దేశాలని తీవ్రంగా వ్యతిరేకించాయి , ఖండించాయి .. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కూడా చోటుచేసుకున్నాయి .. ఈ పరిణామాలు తర్వాత ఆసీమ్ మునీర్‌ అమెరికాలో పర్యటించడం ఇప్పుడు కొంత హాట్ టాపిక్ గా మారింది .. అయితే ఈ పర్య‌ట‌న‌లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో ఆసిమ్ మునీర్‌తో ట్రాంప్‌ ప్రత్యేకంగా భేటీ కానున్నారు .. అలాగే ఇద్దరు కలిసి భోజనం కూడా చేయనున్నారు ..


అనంతరం ఇద్దరి మధ్య ప్రత్యేకంగా భేటీ జరగబోతుందని అంటున్నారు .. ఇక అమెరికా పర్యటనలో భాగంగా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ల‌ను కూడా ఆసిమ్ మునీర్‌ కలవనున్నారు .. ఏప్రియల్ 22న పహాల్గమ్‌ ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు చనిపోయారు .. ఇక తర్వాత భారత్ , పాకిస్తాన్ పై కఠిన నిర్ణయాలు తీసుకుంది .. అలాగే పాకిస్తాన్ కు సింధు జలాలను నిలిపివేసింది .. వీసాలు కూడా రద్దు చేసింది .. ఆటారి సరిహద్దు కూడా మూసేసింది .. మే 27న పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్స్ సింధూర్ మొదలు పెట్టింది 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు అంతేకాకుండా పాకిస్తాన్ వైమానిక స్థావరాలను కూడా కూల్చేసింది .


అయితే ఇప్పుడు ప్రస్తుతం కెనడాలు జీ7 శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి .. ఇక ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చారు. అయితే ఇరాన్ , ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ఉదృతంగా ఉండటంతో అద్దాంతరంగా అమెరికాకు వెళ్లిపోయారు ట్రంప్ .. నిజానికి ఈ సమావేశంలో ట్రాంప్ లో మోడీ భేటీ అయి సుంకాలపై చర్చించాల్సి ఉంది .. కానీ ట్రంప్ వెనక్కి వెళ్ళిపోవడంతో ఈ కీలక చర్చలు జరక్కుండానే మధ్యలో ఆగిపోయాయి ..

మరింత సమాచారం తెలుసుకోండి: