
దీంతో ఈ కేసు నమోదు చేసి మరి దర్యాప్తు చేయడంతోA1 గా కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు ఉండగా A2 గా విష్ణువర్ధన్ రెడ్డి, A3 గా శ్రీధర్ రెడ్డిలతో పాటు మరొక పదిమంది పేర్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినట్లు సమాచారం. 2019కి ముందు కృష్ణపట్నం పోర్టులో ఎక్కువగా వాహనాల రాకపోకలు కొనసాగిస్తూ ఉండేది. వీటి నిర్వహణ కోసమే అప్పట్లో లారీ వెల్ఫేర్ అసోసియేషన్స్ ట్రాన్స్పోర్టర్లు చేయించుకున్నారు. వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ఎమ్మెల్యేగా గెలిచిన కాకాణి.. ఆ లారీ అసోసియేషన్ ని లాక్కోవడంతోపాటు అక్కడ పలు రకాల కంపెనీలను కూడా ఏర్పాటు చేశారట.
అక్కడ దిగుమతి చేసే కంపెనీలతోపాటుగా , ఇతర వాటినే సమకూర్చే కాంట్రాక్ట్ ను కూడా చాలా బలవంతంగా తీసుకున్నారట. దీంతో అక్కడే ఒక టోల్గేట్ ని కూడా ఏర్పాటు చేసి పోర్టుకు రాకపోకల వాహనాలకు సంబంధించి డబ్బులను కూడా వసూలు చేయించారని సమాచారం. ట్రక్కు యొక్క బరువు ఆధారంగా 4 శాతం వరకు వసూలు చేశారని .. దీంతో కంటైనర్ యాజమాన్యులు చెన్నై పోర్టు మక్కువ చూపారు. దీంతో కృష్ణపట్నం పోర్టులో ఉండే టెర్మినల్ మూతపడిందని ఉద్యోగులు తెలియజేస్తున్నారు.
ఏపీ సిటి ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ పేరుతో 2022 ఏర్పాటు చేసి ఎగుమతి, దిగుమతి చేసే రవాణా పైన చార్జీలు పెంచారు. ఈ డబ్బులను శ్రీధర్ రెడ్డి పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాకు మళ్ళించేవారట. అందులో వారికి పోయిన వాటా మినహాయించుకొని ట్రాన్స్పోర్ట్ లారీ ఓనర్లకు మిగిలిన డబ్బును ఇచ్చేవారని కానీ వారికి ఆ డబ్బులు సరిపోక చాలామంది పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారట.అయినా కూడా ఫలితం లేకపోయిందని తెలుపుతున్నారు.. తిరిగి తమని చంపుతామంటూ బెదిరించే వారంటూ పోలీసులు విచారణలో తేలిందట.ఇప్పుడు తాజాగా ట్రాన్స్పోర్టర్ ఫరీద్ ఫిర్యాదుతోనే ఈ విషయం బయటపడిందని సమాచారం.