
అయితే గతంలో ఒక ప్రైవేటు వెహికల్ కింద పడి సింగయ్య మృతి చెందారనీ చెప్పారంటూ కొంతమంది మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అప్పుడు తనకున్న సమాచారం మేరకే అలా చెప్పానని తెలియజేశారు ఎస్పీ సతీష్. అయితే తాడేపల్లి నుంచి సత్తెనపల్లికి కేవలం 3 వెహికిల్స్ మాత్రమే అనుమతి ఇచ్చామంటూ చెప్పారు. కానీ దాదాపు 50 వాహనాలలో ఈ ర్యాలీ జరిగిందని ఏటుకూరు రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం వద్ద సింగయ్య అనే వృద్ధుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహన కిందపడి మరణించారని అక్కడ ఉండి కొన్ని సీసీ కెమెరాలు స్థానికులు వీడియోలు తీస్తున్న ఆధారంగానే ఈ విషయం బయటపడిందని తెలిపారు ఎస్పి సతీష్.
ఇక జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసుల విషయానికి వస్తే.. గుంటూరు పోలీసుల కొత్త సెక్షన్లను చేర్చినట్లు తెలుస్తోంది. మొదట BNS 106(1) సెక్షన్ కింద నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమైన వారిపైన కేసు పెట్టగా తాజాగా ఇప్పుడు BNS 105,49 సెక్షన్ ని సైతం జోడించి హత్య కిందకు రాని నేరాలలో BNS 105 సెక్షన్లను ఉపయోగిస్తారట.ఒకవేళ ఇది నిరూపణ అయితే జీవిత ఖైదీ లేదా..5-10 సంవత్సరాలు జైలు శిక్ష, అలాగే ఫైన్ కూడా ఉంటుంది. ఇది నాన్ బెయిల్ కి నేరానికి ప్రేరేపించినట్లుగా సెక్షన్ 49 BNS కింద పెట్టారట.