ఇజ్రాయిల్, ఇరాన్ వివాదంలో వేలు పెడుతూ అమెరికా ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడులు చేసిన‌ విషయం అందరికీ తెలిసిందే .. గత కొంతకాలంగా అణు ఒప్పందం చేసుకోవాలని చాలాకాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ పై ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు .. కానీ ఇరాన్ ఈ విషయంలో స్వాతంత్రం గానే ఉంటుంది .. అలాగే అమెరికా ఇచ్చిన ఆఫర్ కు నో చెబుతూ వస్తుంది .. అయితే ఈ క్రమంలోని ఇరాన్ అణు బాంబులు తయారు చేస్తుందని భవిష్యత్తులో ఇది తమకు ముప్పుగా మారుతుందని ఇజ్రాయిల్ ఆరోపిస్తూ ఇరాన్ పై దాడులు చేయటం మొదలుపెట్టింది ..


ఇక దీంతో ఇరాన్ కూడా ఇజ్రాయిల్ పై ఊహించని విధంగా ప్రతిదాడితో విరుచుకుపడింది .. ఇరాన్ నుంచి ఇంతటి ప్రతిఘటన ఊహించని ఇజ్రాయిల్ ఒక్కసారిగా భయపడిపోయింది .. ఇక వెంటనే అమెరికా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చింది .. ఇలా ఇజ్రాయిల్, ఇరాన్ వివాదంలో జోక్యం చేసుకోవాలా వద్దా అని రెండు వారాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ట్రంప్ .. ఆ మాట చెప్పిన 48 గంటల్లోనే ఇరాన్ పై దాడికి పాల్పడ్డారు .. అలాగే ఈ దాడిపై తాజాగా చైనా స్పందించింది .. ఇరాన్ పై అమెరికా చేసిన దాడిని తీవ్రంగా ఖండించింది .. ఇది కచ్చితంగా అమెరికా చట్టాలను ముల్లంగించుటమే అంటూస్ వార్నింగ్ ఇచ్చింది..


ఇలా ఇజ్రాయిల్ , ఇరాన్ చర్చల ద్వారా వారి సమస్యలను పరీక్షించుకోవాలని కూడా సూచించింది .. అయితే ఇప్పుడు ఇరాన్ కు మద్దతుగా చైనా మాట్లాడటంతో వివాదం మర్రింత జటిలంగా మారుతున్నట్టు కనిపిస్తుంది .. ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా , చైనా మధ్య గ‌త‌ కొన్ని సంవత్సరాలుగా కోల్డ్ వార్‌ జరుగుతూనే ఉంది .. ఈ క్రమంలో ఇజ్రాయిల్ , ఇరాన్ యుద్ధం కారణంగా ఇలా రెండు శక్తివంతమైన దేశాలు చెరో దేశానికి సపోర్టుగా ఉండటంతో ప్రపంచ దేశాల్లో గట్టి ఆందోళన మొదలయ్యింది .. ఇక మరి ఈ వివాదం మరింత ముదిరి .. ఇక మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి .. ఇక మరి ఇజ్రాల్ , ఇరాన్ యుద్ధం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: