ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ పార్టీ రోజురోజుకీ నెమ్మదిగా పుంజుకొనే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి కొంతమంది వైసిపి పార్టీ నుంచి ఇతర పార్టీలలోకి వెళుతూ ఉన్నారు. మరి కొంతమంది అధికార పార్టీని విడిచి మరి వైసీపీ పార్టీలోకి వస్తున్నారు. ఒకవైపు వైసీపీ నేతల మీద కేసులు, కార్యకర్తల మీద కేసులు ఇలా అన్ని జరుగుతూ ఉన్నప్పటికీ ఇలాంటి సమయంలోనే తాజాగా ఒక వైసీపీ ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. పార్వతీపురం వైసిపి మాజీ ఎమ్మెల్యే అలజంగి  జోగారావు కు ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది.



విజయనగరం సమీపంలో ప్రయాణిస్తున్నటువంటి తన కారులో జోగారావు కు ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. తన కారులో ప్రయాణిస్తున్నప్పుడు వెనుక నుంచి ఒక లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదంలో ఆయన కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతినిందని అయితే ఈ ప్రమాదంలో జోగిరావు క్షేమంగానే బయటపడినట్లు సమాచారం. దీనిపైన ఇంకా అధికారికంగా  కుటుంబ సభ్యులు కానీ వైసీపీ పార్టీ కానీ ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉన్నది.ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లుగా అటు కార్యకర్తలకు నేతలకు తెలియగానే కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ మాజీ ఎమ్మెల్యే వయసు 52 సంవత్సరాలు.



2019లో ఆంధ్రప్రదేశ్ శాసనసభలలో వైసిపి పార్టీ నుంచి పార్వతిపురం నియోజవర్గం నుంచి మొదటిసారిగా సీటు దక్కించుకొని గెలిచారు బొబ్బిలి చిరంజీవులను 24,199 ఓట్లతో ఓడించారు. గతంలో బలిజ పేట మండలంలోని చక్కర పల్లి గ్రామానికి సంబంధించి రోడ్డు వేయడానికి తన వంతు సహాయంగా పనిచేయడంతో అక్కడి గ్రామస్తులు సైతం పాలాభిషేకంతో ఈయనను సత్కరించారు..ఇక ఈయన తండ్రి దివంగత సత్యం కుమారుడే. కానీ 2024 ఎన్నికలలో మాత్రం టిడిపి పార్టీకి చెందిన బోనెల విజయచంద్ర చేతిలో 24,144 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరి రాబోయే ఎన్నికలలో వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: