
ఈ రోజున బెంగళూరు నుంచి చిత్తూరు పర్యటనకు రాబోతున్న జగన్ ముఖ్యంగా మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వస్తున్నారు. ఈ పర్యటన కోసం ఈరోజు ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 11 గంటలకు బంగారుపాళ్యం కు రాబోతున్నారు. ఆ తర్వాత అక్కడ మార్కెట్ యార్డులో 11:20 నుంచి 12:20 వరకు ఉండి రైతులతో ముఖాముఖిగా మాట్లాడబోతున్నారు. తిరిగి మళ్లీ 12:35 నిమిషాలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకొని బెంగళూరుకి ప్రయాణించబోతున్నారట.
మాజీ సీఎం జగన్ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సొంత జిల్లా కావడం చేత.. టిడిపి, వైసిపి మధ్య ఇప్పుడు పొలిటికల్ వార్ నడుస్తోంది.. భారీగా కాసిన మామిడికి గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో పాటుగా మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద రైతులు సైతం రాత్రిళ్ళు కూడా పడికాపులుకాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యిందని చర్చ మొదలయ్యింది.. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా మద్దతు తెలపడంతో ఈ సమస్య పొలిటికల్ ఇష్యూ గా మారిపోతున్నది. బంగారుపాళ్యం పర్యటించిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అనే టెన్షన్ ఇప్పుడు ఏపీ అంతట మొదలైంది. అయితే ఇన్ని ఆంక్షలు నడుమ జగన్ వస్తు ఉండడంతో అభిమానులను ఈ ఆంక్షలు ఆపుతాయా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ఇప్పటివరకు జగన్ వెళ్ళిన ప్రతిచోట కూడా భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలు వచ్చారు. మరి ఈ రోజున ఏం జరుగుతుందో చూడాలి.