ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారీ ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత చాలా రకాల సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణను బయటపెట్టారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరు పథకాల ప్రభావం పైన కూడా చాలా రకాల సర్వేలు బయటపడ్డాయి. ఇప్పుడు తాజాగా మరో సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 172 నియోజకవర్గాలలో ఒక్కో నియోజవర్గంలో 425 మంది చొప్పున ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఉమ్మడి జిల్లాల వారీగా పూర్తి వ్యతిరేకత లేదా అసంతృప్తి అనే కోణంలో అభిప్రాయాలను సేకరించారు.


శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లలో టిడిపి 2, బిజెపి, జనసేన ఒక్కో సీట్లలో వ్యతిరేకత ఉన్నదట. మూడు టీడీపీ సీట్లలో అసంతృప్తి ఉన్నదట.


విజయనగరంలో 8 సీట్లు గెలిచిన టిడిపి.. 4 సీట్లలో వ్యతిరేకత.. మరొక సిటీలో అసంతృప్తి.. జనసేన గెలిచిన ఒక్క సీటులో వ్యతిరేకత.

విశాఖపట్నంలో 8 సీట్లలో గెలిచిన టిడిపి ఒక్క సీటులో వ్యతిరేకత.. 2 సీట్లలో అసంతృప్తి.. జనసేన 4 సీట్లలో రెండిట్లో వ్యతిరేకత, మరొక సీటులో అసంతృప్తి.


తూర్పుగోదావరిలో 13 సీట్లలో గెలిచిన టిడిపి.. 4గు వాటిలో వ్యతిరేకత, రెండిట్లో అసంతృప్తి, 5 సీట్లలో గెలిచిన జనసేన..4 సీట్లలో వ్యతిరేకత.. బిజెపి గెలిచిన ఒక సీటులో అసంతృప్తి.


పశ్చిమగోదావరి 9 సీట్లు గెలిచిన టిడిపి..3చోట్ల వ్యతిరేకత, 6 సీట్లు గెలిచిన జనసేన..3 సీట్లలో వ్యతిరేకత.. రెండిట్లో అసంతృప్తి.

కృష్ణ 13 సీట్లలో గెలిచిన టిడిపి..7 వ్యతిరేకత, రెండు అసంతృప్తి.

గుంటూరు 16 సీట్లు గెలిచిన టిడిపి..6 చోట్ల వ్యతిరేకత, రెండుచోట్ల అసంతృప్తి.

నెల్లూరు 10 చోట్ల గెలిచిన టిడిపి..4 వ్యతిరేకత, రెండు అసంతృప్తి.

కడపలో టిడిపి గెలిచిన 5లో.. 3వ్యతిరేకత, ఒకటి అసంతృప్తి, జనసేన బీజేపీ గెలిచిన వ్యతిరేకత.

కర్నూలులో 11 సీట్లు గెలిచిన టిడిపి.. 5 వ్యతిరేకత, రెండు అసంతృప్తి. ఒక బిజెపి వ్యతిరేకత.

అనంతపురం 13 సీట్లు గెలిచిన టిడిపి..6 వ్యతిరేకత, ఒక సీటులో అసంతృప్తి, బిజెపి ఒక సీటుపై వ్యతిరేకత.

చిత్తూరు 11 గెలిచిన టిడిపి.. 5వ్యతిరేకత, రెండు అసంతృప్తి, జనసేన సీటుపై వ్యతిరేకత.


మొత్తం మీద ఇలా రాష్ట్రంలో కూటమి పార్టీలలో 72 సీట్లు టిడిపి, మరో 26 జనసేన లో అసంతృప్తులు ఉన్నవి. టిడిపిలో 54 మంది డేంజర్ జోన్ లో ఉండగా జనసేనకి సంబంధించి 14 మంది బిజెపికి సంబంధించి నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇలా మొత్తం మీద చూసుకుంటే.. 98 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేనట్లు కనిపిస్తోందట. ఇందుకు సంబంధించి ట్విట్ వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: