
తెలంగాణలో గత ఎన్నికలలో ఓటమి తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. మరీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఫ్యామిలీ లోనే కుమార్తె కల్వకుంట్ల కవిత ఎదురు తిరిగిన వైనం అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. కవిత గత కొంతకాలంగా సొంతంగా రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా తన తెలంగాణ జాగృతిని విస్తరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. కేటీఆర్ ఎవరు ? అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ వారసుడు కేటీఆర్ కాదు అన్నట్లుగా కవిత కామెంట్లు ఉన్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ తన సోదరికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇన్చార్జిగా మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ను నియమించినట్లు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తాజాగా తెలంగాణ భవన్లో సంఘ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. బీఆర్ఎస్ కు అనుబంధంగా ఏర్పడిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కు ఎమ్మెల్సీ కవిత ఇప్పటివరకు గౌరవాధ్యక్షురాలు గా ఉన్నారు. ఆమె ఆధ్వర్యంలోనే ఈ సంఘం కార్యక్రమాలు అన్నీ కొనసాగుతూ వస్తున్నాయి. ఇటీవల కేటీఆర్ ను .. అటు బి ఆర్ ఎస్ పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ కవితకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారని తెలంగాణ రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు