
అందులో స్పష్టంగా, “నా ఆత్మహత్యకు కారణం EE, DEE, mla కొలికపూడి శ్రీనివాస్ రావు,” అని పేర్కొన్న AE కిషోర్, తనపై అధికారులు పెడుతున్న ఒత్తిడి, పనికి సంబంధించిన అన్యాయ ఆదేశాలు, ఫోర్స్‌డ్ ట్రాన్స్ఫర్లు, ఎవరూ సహకరించకపోవడం, ప్రశాంతంగా జీవించే అవకాశం లేకుండా చేయడం వంటివన్నీ పేర్కొన్నారు. ఈ లేఖను పరిశీలించిన అధికారులు వెంటనే స్పందించి కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు పోలీసుల ఆదిశగా ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం. ఇదే విషయాన్ని AE రాసిన లాస్ట్ లైన్‌లో “నా రిలీవ్ ఆర్డర్ ఇప్పటివరకు ఇవ్వలేదు, ఇది కూడా నా ఆత్మహత్యకు కారణం” అంటూ హైలైట్ చేశారు.
ఈ సంఘటనపై స్థానిక ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఇలా పని ఒత్తిడి, రాజకీయ నైపుణ్యాలతో కొందరు నాయకులు మరియు అధికారులు వేధించడం అన్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఒక యువ ఉద్యోగి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి వెనుక కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. AE కిషోర్ మృతిపై ప్రభుత్వం స్పందించి అతని కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటన మరోసారి ప్రభుత్వ రంగ ఉద్యోగులపై ఉండే ఒత్తిడుల నిజాలను, వారి మెంటల్ హెల్త్ గురించి మనం ఎంతగానో పట్టించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తోంది.