హరిహర వీరమల్లు సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. 250 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు ప్రీమియర్స్ ప్రదర్శితం కానున్నాయి. ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్ రేటు 600 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. ప్రీమియర్స్ వల్ల వీరమల్లుకు లాభమా? నష్టమా? అనే చర్చ సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

హరిహర వీరమల్లు  సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే టికెట్ రేటు ఎక్కువగా ఉన్నా నష్టం లేదు. అయితే ప్రీమియర్ షోల వల్ల రివ్యూలు సైతం ఎర్లీగా వచ్చే అవకాశం ఉంది. హరిహర వీరమల్లు సినిమాకు  ఒకింత భారీ స్థాయిలోనే  టికెట్ రేట్ల పెంపు దక్కిందని  కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ సినిమా అంటే ఈ  స్థాయిలో ఖర్చు చేయడానికి అభిమానులు ఏ మాత్రం వెనుకాడరనే సంగతి తెలిసిందే.

సినిమా గ్రాండియర్ గా ఉంటే  మాత్రం కలెక్షన్ల విషయంలో సంచలనాలు నమోదయ్యే ఛాన్స్ అయితే ఉందని   కామెంట్లు వినిపిస్తున్నాయి.  నిధి అగర్వాల్ ఈ సినిమాతో  పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్  సొంతం చేసుకునే ఛాన్స్ అయితే  ఉందని  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  హరిహర వీరమల్లు రికార్డుల వీరమల్లు అయితే  మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.

హరిహర వీరమల్లు మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా   ఈ సినిమా సంచలన విజయం సాధిస్తే మాత్రమే  సెకండ్ పార్ట్ తెరకెక్కే ఛాన్స్ ఉంది.  దర్శకుడు క్రిష్ ఈ సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.   హరిహర వీరమల్లు  ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.  ఈ సినిమాలో యాక్షన్ సీన్స్  స్పెషల్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. పవన్ హరిహర వీరమల్లు ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేసే సినిమా కావాలని  ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: