
ప్రముఖ సైన్స్ పత్రిక 'నేచర్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, కరోనా సోకిన వారి మెదళ్ళ పరిమాణంలో గణనీయమైన మార్పులు సంభవించాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్య పరిష్కార సామర్థ్యం వంటి వాటికి సంబంధించిన మెదడు భాగాలు కుంచించుకుపోయినట్లు ఈ అధ్యయనాల్లో వెల్లడైంది. 400 మంది కరోనా బాధితుల మెదడు స్కాన్‌లను విశ్లేషించిన తర్వాత ఈ నివేదికను సమర్పించారు.
ఆలోచనల్లో స్పష్టత కోల్పోవడం, జ్ఞాపకశక్తి మందగించడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలతో ఎక్కువమంది బాధ పడుతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారి మెదళ్ళు ఐదున్నర నెలలు ఎక్కువగా వృద్ధాప్యానికి గురయ్యాయని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. వయో వృద్ధులు, తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు, బలహీన నేపథ్యం ఉన్నవాళ్ళ కుటుంబాల్లో ఈ లక్షణాలు ప్రధానంగా కనిపించాయి.
కరోనా వైరస్ శరీరంలోని రక్తనాళాలపై దాడి చేయగలదు, దీనివల్ల మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇది మెదడు కణాలకు ఆక్సిజన్, పోషకాలు అందకుండా చేసి వాటిని దెబ్బతీస్తుంది. : వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల శరీరంలో తీవ్రమైన వాపు ఏర్పడుతుంది. ఈ వాపు మెదడుకు కూడా వ్యాపించి, నరాల కణజాలాన్ని ప్రభావితం చేయగలదు. తీవ్రమైన కరోనా కేసులలో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల వల్ల శరీరానికి, ముఖ్యంగా మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీర్ఘకాలిక ఆక్సిజన్ లోపం మెదడు కణాలకు శాశ్వత నష్టాన్ని కలిగిస్తుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు