అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తన కుటిల రాజకీయం చాటిచెప్పాడు. మాటల్లో మిత్రుడి లా మాట్లాడి, చేతల్లో మాత్రం పగపడే ప్రవర్తన మరోసారి బయటపడింది. “ప్రధాని మోదీ నా మంచి స్నేహితుడు” అని చెప్పే ట్రంప్ , ఇప్పుడు భారత్ పై భారీగా పన్నుల భారం మోపుతూ తన అసలైన వేషాన్ని చూపించాడు. 25% టారిఫ్ – భారత్ ఎగుమతులపై కత్తిరింపు! .. ట్రంప్ తాజా నిర్ణయం ప్రకారం, భారత్ నుంచి అమెరికాకు వెళ్లే అనేక రకాల ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాలు ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రధానంగా ఫార్మా, టెక్స్టైల్, గోల్డ్ & డైమండ్స్, కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపబోతోంది.


వాస్తవ కారణం ఏమిటి? ..  ట్రంప్ వాదన ఏంటంటే, రష్యా నుంచి భారత్ భారీగా ఆయుధాలు, చమురు కొనుగోలు చేస్తోంది, ఇది ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా అనుకూలించదగిన చర్య కాదు అని. ఈ నెపంతో భారత్ పై సుంకాలు పెంచినట్లు చెబుతున్నారు. చైనా, భారత్ వంటి దేశాలు రష్యా తో గణనీయంగా ట్రేడింగ్ చేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటనలతో స్పష్టమవుతోంది. ఎగుమతులకు ఎఫెక్ట్ – రూపాయికి ఝలక్! ..  భారతదేశం ప్రతి సంవత్సరం సుమారు 87 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు ఈ టారిఫ్‌ల వల్ల ఆ ఎగుమతులు తగ్గే ప్రమాదం పొంచి ఉంది. ఫలితంగా కంపెనీలకు వచ్చే ఆర్డర్లు తగ్గిపోవచ్చు. దీని ప్రభావంగా ఉపాధి అవకాశాల పై తీవ్ర దెబ్బ, ఉద్యోగాల్లో కోత, ఎగుమతి ఆదాయం పై నెగెటివ్ ఇంపాక్ట్ – ఇవన్నీ రూపాయిని బలహీనంగా మార్చే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.


ఒక డాలర్ = రూ. 87.65 – ఇంకా పడిపోతుందా? ..  ఇప్పటికే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ. 87.65 వద్ద కొనసాగుతోంది. ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో ఈ విలువ మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో ధరలు పెరిగిన నేపథ్యంలో అక్కడి దిగుమతిదారులు భారత ఉత్పత్తులను తగ్గించి ఇతర ప్రత్యామ్నాయాల్ని చూస్తే... భారత పరిశ్రమలు పెద్ద దెబ్బ తినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిత్రుడా.. మోసగాడా? ..  “మిత్రదేశం” అంటూ ముద్దు మాటలు పలికే ట్రంప్, అసలు లోనికి వెళ్లితే భారత్‌పై వాణిజ్య పోరాటానికి సిద్ధమవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మోదీట్రంప్ స్నేహం ఒక క్షణం ... ఇప్పుడు మళ్లీ ఆ "ట్రంప్ టారిఫ్" రాజకీయ మాయాజాలం మళ్లీ భారత్‌ను ముద్దాడుతోంది! వాణిజ్య యుద్ధానికి ఇది ఓ ప్రారంభ సంకేతమా ? – అన్నదే ఇప్పుడు భారత్ వ్యాపార వర్గాల్లో హాట్ డిబేట్ !

మరింత సమాచారం తెలుసుకోండి: