
తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైసిపి అభ్యర్థి మార్పుపై వైసీపీ అధినేత జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గత ఎన్నికలలో వైసిపి తరఫున మాజీ ముఖ్యమంత్రి నేదురమిల్లి జనార్దన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. వాస్తవానికి ఆయన 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లారు. ఆ ఎన్నికల్లోనే ఆయన వెంకటగిరి సీటు వస్తుందని హాజరు పెట్టుకున్నారు. అయితే జగన్ రామ్ కుమార్ రెడ్డిని కాదని అప్పటికప్పుడు టిడిపి నుంచి వచ్చిన ఆనం రామనారాయణరెడ్డికి వెంకటగిరి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. ఐదేళ్లపాటు రామ్ కుమార్ రెడ్డి వైసీపీలో ఎంతో కష్టపడ్డారు. ఏదో నామినేటెడ్ పదవి ఇచ్చి సరిపెట్టేశారు. గత ఎన్నికలకు ముందు రామ్ నారాయణ్ రెడ్డి తిరిగి టీడీపీలోకి వెళ్లిపోయారు. రామ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి వెంకట గిరి లో పోటీ చేసి ఓడిపోయారు.
ప్రస్తుతం ఆయనే నియోజకవర్గ ఇన్‌చార్జ్ గా ఉన్నా కూడా భవిష్యత్తులో మార్పు అనివార్యం అని వైసీపీ వాళ్లే చెపుతున్నారు. ఆయన స్థానంలో వెంకటగిరి రాజా కుటుంబాన్ని బరిలోకి దింపాలన్నదే జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ మేరకు రామ్ కుమార్ రెడ్డికి జగన్ సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడ్డారు రామ్ కుమార్. మరి ఇప్పుడు కూడా ఆయన కష్టపడుతున్నారు. ఈ టైంలో ఆయనను పక్కన పెడితే జగన్ ఆయనకు ఎలా న్యాయం చేస్తారో ? చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు