మనం చేసే పుణ్యాలు వచ్చే జన్మలోకి వెళ్తాయి. కానీ పాపాలు మాత్రం ఈ జన్మలోనే అనుభవించి ఈ లోకాన్ని దాటేస్తామని చాలా మంది పెద్దవారు చెబుతుంటారు. ఆ కారణంగానే మంచి పనులు ఎక్కువగా చేయమని, చెడు పనుల జోలికి వెళ్లొద్దని పెద్దలు హెచ్చరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలను ఏడిపించకూడదని చెబుతారు. ఎందుకంటే ఆడపిల్లలను ఏడిపిస్తే వారి కన్నీటి మూల్యం తప్పకుండా చెల్లించుకోవాల్సిందేనని, ఆడవాళ్లు పెట్టే శాపాలు తప్పక తగులుతాయని పెద్దలు చెబుతారు. ఆడవాళ్లు ఉసురు తగలకుండా ఎవ్వరూ తప్పించుకోలేరని కూడా హెచ్చరిస్తారు. కొన్ని సందర్భాల్లో పండితులు, ఇంటి పెద్దలు లేదా ఆ శాపాలను అనుభవించినవాళ్లు పక్కవాళ్లను హెచ్చరించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి.


ఇప్పుడు తాజాగా అదే విషయాన్ని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో హైలైట్ చేస్తున్నారు కొందరు. తెలంగాణ రాజకీయాలలో గులాబీ దళపతి కేసీఆర్‌కి ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఆ పాత్రను ఎవరు అంత ఈజీగా మరిచిపోలేరు. ఒకప్పుడు కేసీఆర్ కారు వస్తుందంటే ఆ రూట్ మొత్తం గజగజ వణికిపోయేది. సైరన్లతో బాస్ ఎంట్రీ ఇచ్చినట్టుగా హంగామా చేసేవారు. కానీ ఇప్పుడు సీన్ మాత్రం పూర్తిగా మారిపోయింది. అధికారం ఉండగా ఆ రేంజ్ లో కనిపించడం సహజమే అనుకోవచ్చు. కానీ కేసీఆర్‌ని వ్యక్తిగతంగా ఇష్టపడి అభిమానించే వారు కూడా చాలామంది ఉన్నారు అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు తెలంగాణ అంటే గుర్తొచ్చేది కేసీఆర్ అనే స్థాయిలో ఆయన ఉన్నారు.



కానీ ఇప్పుడు ఆయనను చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఎందుకు ఇంతలా మారిపోయారు? ఏమైనా అనారోగ్య సమస్యలున్నాయా? అనారోగ్యం వల్ల ఇంత బలహీనంగా, ఇంత నిర్జీవంగా మారిపోయారా? అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దీనంతటికీ కారణం, ఇటీవల కేసీఆర్ జరుపుకున్న వినాయక చవితి ఫోటోలు బయటకు రావడమే. బుధవారం తన సతీమణితో కలిసి గణపతి పూజ ప్రత్యేకంగా నిర్వహించారు. ఆ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.



ఆ ఫోటోల్లో కేసీఆర్ అంత ఆరోగ్యంగా లేరనేలా కనిపించారని జనాలు అంటున్నారు. ఆయన ముఖం నల్లబడిపోయిందని, బాగా సన్నగిపోయారని, ఏదో భయంకరమైన సమస్య ఉన్నట్టుగా అనిపిస్తోందని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ఆయన ముఖంలో కాంతి కూడా కనిపించడం లేదని, కేసీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే కొందరు వయసు పెరిగినప్పుడు ఇలాగే ఉంటారని చెప్పుతుంటే, మరికొందరు మాత్రం గతంలో చేసిన పాపాలే ఇప్పుడు ముసలితనంలో వెంటాడుతున్నాయని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చాలా మందిని ఏడిపించారని, ఆయన కారణంగా ఇబ్బందులు పడ్డ మహిళలు కూడా ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా తన ఇంటి ఆడబిడ్డ కవిత విషయంలో తీసుకున్న నిర్ణయాల వలన ఆమె కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందని, ఆ కన్నీటి మూల్యం ఇప్పుడు కేసీఆర్ చెల్లించుకుంటున్నారని మాట్లాడుకుంటున్నారు. చాలామంది, కేసీఆర్ గతంలో చేసిన తప్పులే ఇప్పుడు శాపంలా ఆయనను వెంటాడుతున్నాయని చెబుతున్నారు. కావాలని ఆయన వయసును కూడా పక్కన పెట్టి ఇలా మాట్లాడుతున్నారు. కొంతమంది ఆ దేవుడి స్క్రిప్ట్ ఇది..ఇంకా అనుభవించాల్సిందే అంటున్నారు. దీనిపై కేసీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. “ఈ సమయంలో కేసీఆర్‌పై ఇలాంటివి చెప్పడం అవసరమా? బుద్ధి ఉన్నవాళ్లు ఇలా చేస్తారా? కడుపు కి అన్నం తిననివాళ్ళే ఇప్పుడు ఇలా ట్రోలింగ్ చేస్తున్నారు” అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: