జగన్.. ఏపీలో చంద్రబాబు తర్వాత అంతటి క్రేజ్ ఉన్న నాయకుడు.. చంద్రబాబుతో పోలికేంటి.. మా జగన్ కు అంత కన్నా ఎక్కువ క్రేజ్ ఉందని వైసీపీ నాయకులు చెప్పుకుంటారనుకోండి అది వేరే సంగతి. అంతా బావుంటే తాను ఈ పాటికి ఏపీ ముఖ్యమంత్రిని అయిపోయి ఉండేవాణ్ణని జగన్ కు అపరిమితమైన విశ్వాసం. కానీ దురదృష్టం.. గత ఎన్నికల్లో అంతగా సక్సస్ కాలేకపోయారు. 

జగన్ ను విమర్శించాలంటే వ్యతిరేక రాజకీయ పార్టీలకు ముందుగా గుర్తొచ్చేది అవినీతి, అక్రమ సంపాదన. తండ్రిని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు వెనకేసుకున్నారని టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలు, యాగా అంతా ఇంతా కాదు. అవి నిజమో అబద్దమో ఇంకా తెలియదు. విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు టీడీపీ నేతలు జగన్ పై ఇంకో సంచలన ఆరోపణలు చేస్తున్నారు. 

జగన్ కు అనేక మంది సినిమా హీరోయిన్లతో అక్రమ సంబంధాలున్నాయట. అవన్నీ తాము బయటపెడితే జగన్ జనానికి ముఖం చూపించలేరట. జగన్ చీకటి వ్యవహారాలు కూడా త్వరలోనే బయటపెడతామని ఘాటుగానే అంటున్నారు. అసలు ఈ అక్రమ సంబంధాల విషయం ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు గుర్తొచ్చిందంటే.. మొన్న  ఆ మధ్య లోకేశ్ చేసుకున్న మందుపార్టీ ఫోటోలను సాక్షి హైలెట్ చేసి ప్రచురించింది. 

వైసీపీ నాయకులను ఆధారాల్లేకుండా జైల్లో పెట్టారని వార్త రాస్తూ.. అసలు ఆధారాలంటే ఇవీ.. అంటూ లోకేశ్ పోటోలతో ఓ పెద్ద ఆర్టికల్ ప్రచురించారు. దీంతో టీడీపీవాళ్లకు అరికాలి మంట నెత్తికెక్కింది. సంబంధం లేని విషయంలో లోకేశ్ స్నేహితుల ఫోటోలు ప్రచురిస్తూ వార్తలు రాయడమేంటని విమర్సించింది. సాక్షి వైఖరి ఇలాగే కొనసాగితే.. జగన్ చీకటి వ్యవహారాలు బయటపెడతామని గట్టి వార్నింగ్ ఇచ్చింది.

టీడీపీ ఆరోపణలతో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు మొదలయ్యాయి. జగన్ కు హీరోయిన్లతో సంబంధమున్న సంగతి వాస్తవమేనా.. ఎలాంటి ఆధారమూ లేకుండా టీడీపీ నాయకులు అలాంటి ఆరోపణ చేస్తారా.. నిప్పులేకుండా పొగ వస్తుందా.. ఉంటే ఆ హీరోయిన్లు ఎవరు.. అంటూ ఈ ఇష్యూ గురించి హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. మరి నిజానిజాలేంటో ఆ దేవుడికే తెలియాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: