తెలంగాణ రాష్ట్రం లో పర్యటిస్తున్న అమిత్ షా లక్ష కోట్ల నిధులు ఇచ్చాం అంటూ చెప్పడం దాన్ని కెసిఆర్ ఖండించడం తెలిసిన విషయమే. మళ్ళీ అమిత్ షా ఈ సారి లెక్కలతో సహా తెలంగాణా కి లక్ష కోట్లు ఎక్కడెక్కడ ఇచ్చామో చెప్పుకొచ్చారు. తెలంగాణకు గడిచిన మూడేళ్లలో రూ.96406 కోట్ల నిధులు ఇచ్చినట్లుగా లెక్క చెప్పారు. వివిధ పథకాల అమలుకు రూ.12 వేల కోట్లు తెలంగాణకు ఇచ్చినట్లుగా చెప్పారు.



తెలంగాణలో ఎయిమ్స్.. అగ్రికల్చర్.. హార్టీ కల్చర్.. వెటర్నరీ వర్సిటీలను ఏర్పాటు చేసినట్లుగా చెప్పిన ఆయన.. 70 ఏళ్లలో సాధ్యం కానిది మూడేళ్లలో చేసి చూపించినట్లుగా పేర్కొన్నారు. 28 కోట్ల జన్ ధన్ అకౌంట్లను తెరిపించామని.. 7.5 కోట్ల మందికి ఉపాధి కల్పించామని వెల్లడించారు. మోడీ నేతృత్వంలో సర్కారు అభివృద్ధి రథం దౌడు తీస్తుందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: