కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వర్సెస్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా .. వీరిద్దరి మధ్యన కార్చిచ్చు దహనకాండలా మండుతూనే ఉంది. అమేథీ ప్రాంతం లో జరుగుతున్న పోటాపోటీ సభలలో ఒకరి మీద ఒకరు బురద దల్లుడు కార్యక్రమం లో చాలా బిజీ గా ఉన్నారు. " మేము ఈ దేశానికి నోరు మూసుకోకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ప్రధానమంత్రి ని ఇచ్చాము. నెహ్రూ గాంధీ కుటుంబం ఏం ఇచ్చిందో చెప్పండి ? గుజరాత్ లో అభివృద్ధి చూడండి , అమేథీ ప్రాంతం లో అభివృద్ధి చూడండి.

అమేథీ ప్రజలు మార్పు ని కోరుకుంటున్నారు. వారు ఇక మీదట రాహుల్ మీద డిపెండ్ అవ్వాలి అనుకోవడం లేదు ఇది మంచి పరిణామమే " అన్నారు అమిత్ షా. ‘‘మీరు 60 ఏళ్లపాటు ఓ కుటుంబాన్ని విశ్వసించారు. ఇప్పుడు బీజేపీని, ప్రధాని మోదీని నమ్మండి. మీరు ఇక మోసపోరు’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.

"రెండు రకాల అభివృద్ధి సాంపిల్స్ మీకు కనిపిస్తున్నాయి ఒకటి నెహ్రూ గాంధీ మోడల్ అవగా మరొకటి మోడీ మోడల్ , గత మూడేళ్ళలో ప్రభుత్వం దాదాపు నూట ఆరు ప్రాజెక్ట్ లు మొదలు పెట్టింది. డబ్భై ఏళ్ళ పాటు పాలన్ చేసిన కాంగ్రెస్ ఈ ప్రాంతం లో కలెక్టర్ కార్యాలయం, టీబీ ఆసుపత్రి, రేడియా కేంద్రం  కూడా పెట్టలేక పోయింది " అన్నారు అమిత్ షా.

ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి (రాహుల్) కనిపించకుండా పోవడం 35-40 ఏళ్లలో తొలిసారి చూస్తున్నానని, పరాజయం పాలైన వ్యక్తి (స్మృతి) మాత్రం ప్రజల కోసం సమయం కేటాయిస్తున్నారంటూ రాహుల్‌ను ఎద్దేవా చేశారు అమిత్ షా.


మరింత సమాచారం తెలుసుకోండి: