కేఏ పాల్‌.. ప్రస్తుతం తెలుగు రాజకీయాలతో బుర్ర వేడెక్కిపోతున్నవారికి ఒకే ఒక ఉపశమనం. ఒక్కసారి ఆయన ప్రెస్ మీట్ వింటే.. ఎలాంటి వారికైనా నవ్వురాక మానదు. అది ఆత్మవిశ్వాసమో..అతి విశ్వాసమో తెలియదు కానీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రజాశాంతి గెలుస్తుందని... తాను సీఎం అవుతానని ఆయన విపరీతంగా నమ్ముతున్నాడు.

ka paul vs pawan కోసం చిత్ర ఫలితం

అలాంటి కేఏ పాల్ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేస్తున్నాడు. నిన్న మొన్నటి వరకూ పవన్ కల్యాణ్ నాతో కలిస్తే సీఎం అవుతాడు అంటూ కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాడు కేఏ పాల్. పాపం.. ఎంత పిలిచినా పవన్ రాకపోయేసరికి ఇప్పుడు పవన్ కల్యాణ్ పై కూడా సెటైర్లు వేయడం ప్రారంభించాడు.

ka paul vs pawan కోసం చిత్ర ఫలితం

తాజాగా శుక్రవారం విశాఖలో పెట్టిన కే ఏపాల్ ను పవన్ కల్యాణ్ గురించి కొందరు ప్రశ్నలు అడిగారు. అప్పుడు కే ఏపాల్ ఏమన్నాడో తెలుసా.. ఆయన అన్నయ్య చిరంజీవికే దిక్కులేకుండా పోయింది. మొదటి దానికి మొగుడు లేడురా అంటే.. కడ దానికి కల్యాణం అన్నాడట ఒకడు.. అంటూ సామెతలతో సెటైర్లు వేశాడు కేఏ పాల్.

ka paul vs pawan కోసం చిత్ర ఫలితం

చిరంజీవి అంతటి వాడే రాజకీయాల్లో పత్తా లేకుండా పోయాడని.. ఇక పవన్ కల్యాణ్ ఎంత అన్నట్టు తీసిపారేసాడు కే ఏ పాల్.. చిరంజీవి, పవన్ కల్యాణ్ వీరంతా అభిమానులపై నమ్మకంతో రాజకీయాలు నడిపారని.. కానీ తాను వాస్తవంగా ఆలోచించి లెక్కలు వేసుకుంటున్నానని చెబుతున్నాడు కే ఏ పాల్.. మరి ఆయన లెక్కలు ఎంత పక్కాగా వర్కవుట్ అవుతాయో అదీ చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: