చంద్రబాబునాయుడుకు ఏమవుతోందో అర్ధం కావటం లేదు. ఇదే విషయమై జనాల్లో చర్చకూడా మొదలైంది. బయటకు మాత్రం యూపిఏనే అధాకారంలోకి వస్తుందని చెబుతున్న చంద్రబాబు పార్టీ పార్టీ నేతలతో మాత్రం బిజెపి వైపు మొగ్గు చూపుతున్నట్లు మాట్లాడుతున్నారట. దాంతో చంద్రబాబు మనసులో ఏముందో, తామెవరిని సపోర్టు చేస్తు మాట్లాడాలో అర్ధంకాక జుట్టు పీక్కుంటున్నారట.

 

ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత నుండి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రాహూల్ తో మంతనాలు జరుపుతున్నారు, వెళ్ళినపుడల్లా శాలువాలు కప్పుతున్నారే కానీ యూపిఏలో మాత్రం చంద్రబాబు చేరలేదు. ప్రస్తుత విషయం చూస్తే 6 దశల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ, యూపిఏ కూటముల్లో దేనికీ సంపూర్ణ మెజారిటీ రాదని అర్ధమవుతోంది.

 

ఇప్పటి వరకూ తటస్ధంగా ఉన్న పార్టీలు టిఆర్ఎస్, వైసిపి, బిజూ జనతాదళ్, టిఎంసి, ఎస్పీ, బిఎస్పీ రేపటి కేంద్రప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ పార్టీల్లో ఏవి ఎన్డీఏని సమర్ధిస్తాయి ? ఏ పార్టీలు యూపిఏ వైపు మొగ్గు చూపుతాయనే విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడే చంద్రబాబు తన తెలివితేటలను (డబల్ గేమ్) ప్రదర్శిస్తున్నారట.

 

పై రెండు కూటముల్లో ఏది అధికారంలోకి వచ్చినా తాను మాత్రం సేఫ్ గా ఉండేలా చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారట. ఎన్డీఏ, యూపిఏల్లో ఏ కూటమికి సొంతంగా ఎన్ని సీట్లు వస్తాయనే విషయం మీద తటస్ధుల అవసరం ఎంత ఉంటుందన్న విషయంలో స్పష్టత వస్తుంది. ఎన్డీఏ 200 సీట్ల దగ్గర ఆగిపోతే బయట నుండి ఎవరు మద్దతిస్తారో చూడాలి. అలాగే అదే యూపిఏకి ఏ 170 వచ్చినా మద్దతిచ్చేందుకు తటస్ధులు ముందుకొస్తే యూపిఏనే అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంది.

 

ఇటువంటి లెక్కలతోనే ప్రస్తుతమైతే బాగా అయోమయం ఉందన్నది వాస్తవం. అందుకనే చంద్రబాబు రెండు పడవల్లోను ప్రయాణం చేయాలని చూస్తున్నట్లు అర్ధమవుతోంది. లేకపోతే కేంద్రంలో మళ్ళీ మోడినే ప్రధానమంత్రయి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే చంద్రబాబు పని గోవిందానే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: