సాధారణంగా ప్రతిపక్షం వాళ్లు స్పీకర్ పోడియంను చుట్టుముట్టడం చూస్తుంటాం. భారతీయ చట్టసభల్లో ఇది సాధారణంగా కనిపించే దృశ్యమే. ప్రజాసమస్యలు కాకుండా... చట్టసభలు అంటే నేతల వ్యక్తిగత అంశాల గురించి చర్చలు జరిగే వేదికలుగా.. ఒకరిని ఒకరు దూషించుకునే రచ్చబండలుగా మారిన నేపథ్యంలో స్పీకర్ పోడియం ను చుట్టుమట్టడం అనేది ఒక ఫ్యాషన్ అయ్యింది. ఇటువంటి నేపథ్యంలో గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ రెండు రోజులుగా అధికార పార్టీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముడుతున్నారు. ప్రతిపక్ష నేతపై ధ్వజమెత్తుతూ వీళ్లు స్పీకర్ ను చుట్టుకొంటున్నారు. జగన్ క్షమాపణలు చెప్పాలంటే సభకార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారు. దీంతో శనివారం రోజున కూడా సభ వాయిదా పడింది. తెలుగుదేశం పార్టీ సభ్యుల నినాదాలతో హోరెత్తుతున్న సభను స్పీకర్ వాయిదా వేశారు. తను జగన్ ను ఎప్పుడూ పరుషపదజాలంతో విమర్శించలేదని.. కాబట్టి జగన్ ఇప్పుడు క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం శాసనసభ్యుడు బుచ్చయ్య చౌదరి అంటున్నాడు. మరి పరుష పదజాలం కాదని ఆయన చెబితే కాదు కదా.. అన్న మాటలు ఏవో చెప్పండి.. తర్వాత మాట్లాడుకొందామని వైకాపా నుంచి డిమాండ్ వినిపిస్తోంది. క్షమాపణ చెప్పే పరిస్థితే లేదని వాళ్లు అంటున్నారు. దీంతో తెలుగుదేశం శాసనసభ్యులు స్పీకర్ పోడియను చుట్టుముట్టారు. సభ వాయిదా పడింది. మరి మొన్నటి వరకూ సభా సమయాన్ని వైకాపా వాళ్లు వృథా చేస్తున్నారని, సభలో గలాభా సృష్టిస్తున్నారని తెలుగుదేశం వాళ్లు అనేవాళ్లు. ఇప్పుడు వాళ్లే ఆ పనిచేస్తున్నారు! మరి అది అధికార పక్షం రాంగ్ వేలో వెళుతోందనేదానికి ఆధారం ఏమో!

మరింత సమాచారం తెలుసుకోండి: