గత రాత్రి జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను లక్నో సూపర్ జెయింట్స్ ఉత్కంఠ మ్యాచ్ లో ఓడించి ఐపిఎల్ సీజన్ 15 లో బోణీ కొట్టింది. 211 పరుగుల లక్ష్యం కూడా చిన్నది అయిపోయింది. ఇరు జట్ల లోని ఆటగాళ్ళు ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగులు సాధించారు. మొదట చెన్నై లో ఉతప్ప 50 పరుగులు, శివం దుబే 49 పరుగులు చేయడంతో చెన్నై 210 పరుగుల మార్కును దాటింది.  ఈ లక్ష్యం లక్నో సాధిస్తుందా అని  అనుకున్నారు. కానీ లక్నో ఓపెనర్లు మొదటి నుండి బౌలర్లపై విరుచుకుపడి పరుగులు సాధించారు. ఓవర్ కు పది తగ్గకుండా ఆడుతూ వచ్చారు.

ఆ తర్వాత వరుస వికెట్లు తీసిన చెన్నై గెలిచేలాగే కనిపించింది. కానీ లూయిస్ మరియు ఆయుష్ బధోని ల విజృంభణతో చెన్నై చేతుల్లోకి వెళ్లిన మ్యాచ్ కాస్త... లక్నో ఖాతాలో పడింది. ముఖ్యంగా యువ ఆటగాడు ఆయుష్ ఆడిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆఖరి రెండు ఓవర్ లలో 34 పరుగులు చేయాల్సిన స్థితిలో మ్యాచ్ గెలుస్తుందని ఎవ్వరికీ నమ్మకం లేదు. కానీ వీరిద్దరూ గెలిపించి చూపించారు. ఆయుష్ బధోని అంతటి ఒత్తిడిలో కూడా ఏ మాత్రం జంకు లేకుండా సిక్సర్ సాధించి లక్నో గెలుపును ఖరారు చేశాడు. మొన్న గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఆయుష్ అర్ద సెంచరీ చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు.

ప్రస్తుతం ఈ ఆటగాడు ఇండియన్ క్రికెట్ లో వైరల్ గా మారాడు. ఢిల్లీకి చెందిన ఈ 22 ఏళ్ళ రైట్ హ్యాండెర్ ఆల్ రౌండర్ అండర్ 19 క్రికెట్ లో ఆకట్టుకుని గౌతమ్ గంభీర్ ను ఆకట్టుకున్నాడు. అందుకే ఐపీఎల్ వేలంలో ఇతనిని  కొనుగోలు చేశారని గత రాత్రి మ్యాచ్ ముగిసిన అనంతరం కే ఎల్ రాహుల్ తెలియచేశారు. అంతే కాకుండా రాహుల్ మాట్లాడుతూ ఇతను ఒక భయం లేని క్రికెటర్ అని ప్రశంసలతో ముంచెత్తాడు. ఇక ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడు అన్నది ఎదురు చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: