
ఇటీవల జరిగిన మ్యాచ్లో కోస్టారికా పై 4-2 తేడాతో ఘనవిజయం సాధించింది జర్మనీ. అయినప్పటికీ ఇక టోర్నీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తొలి మ్యాచ్లో జపాన్ చేతిలో ఓడిపోయిన జర్మనీ ఆ తర్వాత బలమైన స్పెయిన్ కు గట్టి పోటీ ఇచ్చి చివరికి మ్యాచ్ డ్రాగా మాత్రమే ముగించింది. స్పెయిన్ తో మ్యాచ్ డ్రా గా ముగియడం.. ఆ తర్వాత జపాన్ ను స్పెయిన్ ఓడించడంతో జర్మనీ కథ ముగిసిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా నాలుగు సార్లు ఛాంపియన్గా ఉన్న జట్టు వరుసగా ఫిఫా వరల్డ్ కప్ నుండి లీగ్ దశ నుంచి వెను తిరగడం గమనార్హం.
చివరిసారిగా 2014లో ఫిఫా వరల్డ్ కప్ గెలిచింది జర్మనీ. కానీ అప్పుడు జట్టులో ఉన్న ఆటగాళ్లు రిటైర్ కావడంతో ఇక జర్మనీ ఆట కలతప్పింది అని చెప్పాలి. ఒకరకంగా సాకర్ ఆటలో దిగజంగా కొనసాగుతున్న జర్మనీకి ఇలాంటి పరిస్థితి రావడం సగటు క్రీడా అభిమాని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఛాంపియన్ జట్టు అయినప్పటికీ జర్మనీ జట్టులో మునుపటి కలతప్పింది. పూర్వ వైభవం సాధించలేక పోతుంది. ఇది మాకు జరగాల్సిందే అంటూ ఇక ఆ జట్టు అభిమానులు కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. మరోవైపు నాలుగు సార్లు వరల్డ్ కప్ గెలిచిన ఇటలీ కనీసం ఫిఫా వరల్డ్ కప్ కి కూడా క్వాలిఫై కాలేదు.