టెక్నాలజీ లో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే వాహనాలు విషయం లో కూడా సరికొత్త టెక్నాలజీ ఎప్పటికప్పుడు అందుబాటు లోకి వస్తుంది. ఒకప్పుడు కేవలం డీజిల్ తో మాత్రమే వాహనాలు నడిచేవి. కానీ ఆ తర్వాత కాలం లో పెట్రోల్ తో నచ్చే వాహనాలు కూడా వచ్చాయి. ఇక ఇటీవల కాలం లో అయితే ఏకంగా ఇంధనం లేకుండా నడిచే వాహనాలను కూడా కనిపెట్టారు శాస్త్రవేత్తలు.  ఏకంగా ఎలక్ట్రికల్ వాహనాలను తీసుకువచ్చి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటు లోకి తీసుకువచ్చారు అన్న విషయం తెలిసిందే.


 ఇక ప్రపంచం లోనే అన్ని దేశాలు కూడా ఇంధన వాడకాన్ని తగ్గించి ఎలక్ట్రికల్ వాహనాలను పెంచాలి అనే ఉద్దేశం తో ఇక ప్రస్తుతం ప్రణాళిక బద్ధం గా ముందుకు సాగుతున్నాయి అని చెప్పాలి.  బైకులు, కార్లు ఇలా అన్నింటినీ కూడా ఎలక్ట్రికల్ వాహనాలు గానే తయారు చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక అన్ని కంపెనీలు ఇలా ఎలక్ట్రికల్ వాహనాల తయారీలో బిజీ బిజీగా ఉన్న సమయం లో ఒక దేశం మాత్రం ఎలక్ట్రికల్ వాహనాల వాడకాన్ని నిషేధించడం సంచలనం గా మారి పోయింది. స్విట్జర్లాండ్ దేశం ఎలక్ట్రికల్ వాహనాలను వాడటాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతుంది అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం ఆ దేశం తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది అని చెప్పాలి. ఈ నేపథ్యం లో కరెంటు వినియోగాన్ని తగ్గించేందుకు అధికారులు ఇక ఈ ప్రతి  పాదన తెర మీదకి తీసుకువచ్చారట. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలు చేస్తే మాత్రం ఇక ఎలక్ట్రికల్ వాహనాల పై నిషేధం విధించిన మొదటి దేశం  గా స్విజర్లాండ్ నిలుస్తుంది అని చెప్పాలి. అంతే కాకుండా థియేటర్ ప్రదర్శనలు, క్రీడా కార్యక్రమాలను కూడా నిషేధించాలని స్విజర్లాండ్ భావిస్తుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Car