ప్రపంచ క్రికెట్లో మేటి జట్టుగా కొనసాగుతున్న టీమ్ ఇండియాను గత కొంతకాలం నుంచి మాత్రం గాయాల బెడద తీవ్రంగా వేధిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఒక ఆటగాడు గాయం బారిన పడి ఇక కొన్నాళ్లపాటు జట్టుకు దూరం అవడం.  ఇక అతను కోలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చేలోపే మరి కొంతమంది ఆటగాళ్లు గాయం కారణంగా ఇక జట్టుకు అందుబాటులో ఉండలేకపోవడం లాంటివి జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఒక్కసారి కూడా టీమిండియా పూర్తి స్ట్రెంత్ తో మ్యాచ్ ఆడలేక పోతుంది అని చెప్పాలి.


 అయితే గత కొంతకాలం నుంచి ద్వైపాక్షిక సిరీస్లు, మెగా టోర్నీలతో కూడా ఎంతో బిజీబిజీగా గడుపుతుంది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే వరుసగా ఆటగాళ్లకు విశ్రాంతి ప్రకటిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎందుకో టీమ్ ఇండియాను గాయాల బెడదా మాత్రం వేధిస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా కీలక ఆటగాళ్లు దూరం అవుతున్న నేపథ్యంలో టీమిండియా ప్రత్యర్థులకు సరైన పోటీ ఇవ్వలేక పోతుంది. తద్వారా వరుసగా ఓటములు చవిచూస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది అని చెప్పాలి


 అయితే కీలకమైన టి20 వరల్డ్ కప్ ముందు జట్టులో స్టార్ బౌలర్గా కొనసాగుతున్న బుమ్రా, ఇక ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించగలిగిన సత్తా ఉన్న జడేజా దూరమయ్యారు. ఇది జట్టు వ్యూహాలను తారుమారు చేసింది. ఇక ఆ తర్వాత మొన్నటికి మొన్న రిషబ్ పంత్, రోహిత్, దీపక్ చాహార్, కుల్దీప్ సేన్ లు కూడా ఇక ఇలా గాయాల బారిన పడిన ఆటగాళ్ల లిస్టులో చేరిపోయారు. అంతకు ముందు షమీ కూడా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఇక టి20 వరల్డ్ కప్ సహా బంగ్లాదేశ్ తో సిరీస్ ఓటమికి కూడా ఈ గాయాలు ఒక కారణమే అని చెప్పాలి. వరుసగా ఆటగాళ్లు గాయాల బారిన పడుతుంటే నేషనల్ క్రికెట్ అకాడమీ, బిసిసిఐ ఏం చేస్తుంది అంటూ అభిమానులు సోషల్ మీడియా వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: