ప్రస్తుతం భారత మహిళల జట్టు పురుషుల క్రికెట్కు ఎక్కడ తక్కువ కాదు అనే రీతిలో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే . వరల్డ్ రికార్డులు కొల్లగొట్టడం విషయంలో కూడా భారత మహిళా క్రికెటర్లు పురుష క్రికెటర్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇలా తమకు తామే ఆదరణ పెంచుకోవడమే లక్ష్యంగా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం భారత జట్టు అటు సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళలు టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే వరుసగా మ్యాచ్ లలో విజయం సాధిస్తూ సత్తా చాటుతూ ఉంది అని చెప్పాలి.


 కాగా ఇప్పుడు వరకు జరిగిన మ్యాచ్లలో అటు టీమ్ ఇండియా ప్రదర్శన చూస్తే ఇక ఏడాది సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ ను భారత జట్టు గెలుచుకోవడం ఖాయమేమో అని అనిపిస్తుంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు ఏకంగా వరల్డ్ కప్ లో భాగంగా నాలుగు మ్యాచ్లు ఆడిన టీమిండియా జట్టు ఇక మూడు మ్యాచ్ లలో విజయం సాధించింది. ఒక ఇంగ్లాండ్ చేతిలోనే ఓటమి చవి చూసింది అని చెప్పాలి. ఐర్లాండ్ పై విజయం ద్వారా ఏకంగా సెమీఫైనల్ లో అడుగు పెట్టింది టీం ఇండియా జట్టు. అయితే మహిళల జట్టు కెప్టెన్ గా ఉన్న హర్మన్ ప్రీత్ ఇప్పటికే రోహిత్ రికార్డును బ్రేక్ చేసింది అనే విషయం తెలిసిందే.


 ఇప్పుడు వరకు రోహిత్ 148 టీ20 మ్యాచ్ లు ఆడగా అటు హార్మన్ ప్రీత్ కవర్ మాత్రం 149 మ్యాచులతో ఇక ఎక్కువ మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇక ఇప్పుడు ఏకంగా 150 టి20 మ్యాచ్ లు ఆడిన తొలి భారత క్రికెటర్ గా కూడా ఘనత సాధించింది. ఇప్పటివరకు ఏ భారత క్రికెటర్ కూడా ఈ రికార్డు సాధించలేదు అని చెప్పాలి. హర్మన్ ప్రీత్ కౌర్ 2009లో టి20 వరల్డ్ కప్ సమయంలో జట్టులోకి అరంగేట్రం చేసింది. ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఈ అరుదైన మైలురాయిని అందుకుంది అని చెప్పాలి. అంతేకాకుండా ఇక టి20 ఫార్మాట్ క్రికెట్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ గా కూడా హార్మన్ ప్రీత్ కౌర్ నిలిచింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: