ఎక్కడ చినబాబు ఎక్కడ అంటూ, ఒకటే హడావుడి చేసేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అసలు చినబాబు సంగతి వీళ్ళకి ఎందుకు గుర్తుకు వచ్చింది ? ఏం అవసరం వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు.అయినా తెగ హడావుడి నడుస్తోంది. ఆ మధ్య జిల్లాల పర్యటనలు అంటూ హడావుడి చేసిన చినబాబు వీధుల వెంట హడావుడి చేసి శబ్దాలు చేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఏదోలా బయటపెట్టిన చినబాబు ఇప్పుడు కరోనా భయం తో ఇంట్లో  నుంచి బయటకి రాకపోవడానికి కారణం ఏంటో తెలియక తెలుగు తమ్ముళ్లు ఒకరికి ఒకరు జోకులు వేసుకుంటూ, చిన బాబు గురించి ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏపీ, తెలంగాణల్లో పెద్ద హడావుడి నడుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికలు అంటూ అన్ని పార్టీలు హడావుడి చేస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించడంతో , కాబోయే టిడిపి రథసారధి చిన బాబు ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు ఏ చక్రం తిప్పబోతున్నాడు అంటూ ఆరా తీస్తూ, ఆయన పై సెటైర్లు వేసుకుంటున్నారు.


 ఇప్పుడు పెద బాబు , చినబాబు ఇద్దరూ ఏపీలో లేకుండా,  హైదరాబాద్ కే పరిమితం అయిపోయారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటి అందరూ తెలుగు తమ్ముళ్లు లబోదిబో మంటున్నారు. తండ్రి కొడుకులు ఏపీలో ఉండి ఉంటే ఏదో హడావుడి చేసి ఉండేవారని, వారు లేక సందడి లేదు అంటూ జోకులు వేసుకుంటున్నారు. ఏపీ సంగతి ఎలా ఉన్నా, ఇప్పుడు వారు నివాసం ఉంటున్న తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నికల సందడి మామూలుగా లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎన్నికల బరిలో బలం లేకపోయినా, దానిని నిరూపించుకునేందుకు కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధమైపోయింది. అయితే ఇక్కడ అందరికీ ఓ డౌట్ వస్తోంది. ఇంతకీ ఈ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వస్తారా లేక అరకొరగా ప్రచారాన్ని లాగించేసి, అవసరమైతే ఒంటరిగా, లేకపోతే ఎప్పటి నుంచో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్న ఆ బీజేపీ అభ్యర్థులకు సహకారం అందించడం చేయాలని చూస్తున్నారా అనేది తెలియడం లేదట. 



అయితే ఇప్పటికీ చిన బాబు, పెద బాబు కానీ, ఏపీ వైపు కానీ,  గ్రేటర్ ఎన్నికలు వైపు గానీ చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పోనీ చంద్రబాబు వయసు రీత్యా ఇంటికే పరిమితం అయ్యారు అనుకుంటే, చిన బాబు ఎందుకు బయటకు రావడం లేదు అనే ప్రశ్న తలెత్తుతోంది. కాబోయే టీడీపి రథసారధిగా చినబాబు ఎక్కడ ఎన్నికల ప్రచారానికి దిగుతాడో ? అక్కడ పార్టీ ఓటమి చెందితే ఆ నెపాన్ని చినబాబు మీద వేసి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారో అనే అనుమానం పెద బాబు లో ఉండబట్టే ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదా అనే అనుమానాలు ఎన్నో ఎన్నెన్నో తెలుగు తమ్ముళ్ల కు వస్తున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: