
దేవాలయానికి వెళ్ళేటప్పుడు శుభ్రమైన, పవిత్రమైన బట్టలు ధరించడం ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. ఆలయంలో ఎవరితోనూ వాదించడం లేదా గొడవపడటం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. దేవుళ్ళను, పూజారులను లేదా ఇతర భక్తులను అవమానించేలా అస్సలు మాట్లాడకూడదు. ఆలయం పవిత్ర స్థలం, కాబట్టి అక్కడ అశ్లీలమైన విషయాలు లేదా అసభ్యకరమైన పదాలు ఉపయోగించడం చేయకూడదు.
ఆలయంలోకి ఆహారం లేదా నీరు తీసుకువెళ్ళడం మంచి పద్దతి కాదు. ప్రసాదం మాత్రమే ఆలయం లోపల స్వీకరించాలి ఉంటుంది. ఆలయంలోనికి చెప్పులతో లేదా పాదరక్షలతో ప్రవేశించడం మంచి పద్దతి కాదు. ప్రదక్షిణలు చేసేటప్పుడు తప్పు మార్గంలో వెళ్లడం తొందరపడి ప్రదక్షిణాలు చేయడం చేయకూడదు. విగ్రహాలను తాకడం లేదా వాటికి అడ్డుగా నిలబడటం వంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.
అనుమతి లేకుండా ఆలయంలో ఫోటోలు తీయకూడదని చెప్పవచ్చు. ఆలయం ఒక పవిత్ర స్థలం, కాబట్టి అక్కడ నిద్ర పోవడం మంచి పద్దతి కాదు. దేవాలయం నుండి బయటికి వచ్చే ముందు, తమ తప్పులను క్షమించమని దేవుడిని వేడుకుని, కృతజ్ఞతలు తెలుపుకొని రావడం ద్వారా చేసిన పాపాలు తొలగిపోయే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు