ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన యువ హిమదాస్ తొలి స్వర్ణం సాధించిన భారతీయురాలిగా ఘనత సాధించిన సంగ‌తి విదితమే.400 మీటర్ల ఫైనల్లో 51.46 సెకండ్లలో గమ్యం చేరి తొలిస్థానంతో బంగారు పతకం కైవసం చేసుకుంది. కానీ  ఆ మెడల్‌ను అందుకున్న సమయంలో హిమదాస్ భావోద్వేగానికి లోనైంది. మెడల్ సెర్మనీ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో హిమదాస్ ఉన్నట్టుండి ఆనందభాష్పాలను నేల  రాల్చింది. 


మన జాతీయ గీతం జ‌న‌గ‌ణ‌మ‌న‌ పాడుతూనే ఆమె కన్నీరును దిగమింగుకోలేక ఒక్కసారిగా కుమిలిపోతూ తన భావోద్వేగాన్నిదాచుకోలేక కన్నీరు కార్చింది. మహాంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహాంద్రా ఆ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. ఇది మిమ్మల్ని కదిలించకపోతే, ఇక ఏదీ మిమ్మల్ని కదిలించలేదని అంతటి గుండె బరువుతో ఆయన తన ట్యాగ్‌లైన్‌లో పేర్కొన్నారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా హిమదాస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: