ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ కు సంబంధించిన సన్నహాలు ఇప్పటినుంచి మొదలయ్యాయి అన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 19వ తేదీన ఐపీఎల్ మినీ వేలం ప్రక్రియ జరగబోతుంది. అయితే ఈసారి ఐపీఎల్ మినీ వేలంలో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉండడంతో అందరికీ ఇక భారీ ధర పలికే అవకాశం ఉంది అన్నది అర్థమవుతుంది అని చెప్పాలి. అయితే ఇక మినీ వేలం ప్రక్రియ జరగడానికి ముందు నుంచే ఆయా ఫ్రాంచైజీలు  తమ టీమ్ లోకి తీసుకోవాలి అనుకున్న ఆటగాళ్లకు భారీ ధర పెట్టి మరి కొనుగోలు చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్లేయర్లు ఒక టీం నుంచి మరో టీం లోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పాలి.


 అయితే ఎవరు ఊహించని విధంగా ఏకంగా గుజరాత్ టైటాన్స్ జట్టును ఒక ఛాంపియన్గా నిలిపిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఏకంగా జట్టు కెప్టెన్సీ వదిలేసి మరి తన పాత టీమ్ అయిన ముంబై ఇండియన్స్ లోకి వెళ్లిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హార్దిక్  ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని అభిమానులు కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్గా తప్పుకోవడంతో అటు భారత జట్టు యంగ్ ఓపెనర్ అయిన గిల్ కు సారధ్య బాధ్యతలు అప్పగిస్తూ.. గుజరాత్ టైటాన్స్ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.


 ఈ క్రమంలోనే గిల్ ఎంత మేరకు కెప్టెన్ అవుతాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా ఇక తనకు కెప్టెన్సీ దక్కడం గురించి.. గిల్ ఇటీవల స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతటి అద్భుతమైన జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం.. ఎంతో సంతోషంగా గర్వంగా ఉంది అంటూ చెప్పకు వచ్చాడు. నాపై విశ్వాసం ఉంచినందుకు మేనేజ్మెంట్కు ధన్యవాదాలు. జట్టును నడిపించడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు గిల్.

మరింత సమాచారం తెలుసుకోండి: