
బుధవారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ లక్ష్యంగా నిలిపిన 181 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో రాహుల్ కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగారు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో రాహుల్ అవుట్ అయ్యారు. బౌల్ట్ వేసిన బంతికి బయటకి ఆడిన రాహుల్ ఎడ్జ్ తీసుకోవడంతో వికెట్‌కీపర్ రిక్ల్టన్ చురుకైన క్యాచ్‌తో రాహుల్ ని పెవిలియన్‌కి పంపించారు. బౌల్ట్ 18వ ఐపీఎల్ సీజన్‌లో లో ఎనిమిదో వికెట్ తీసుకున్న సందర్భమిదే.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రాహుల్ 12 మ్యాచ్‌ల్లో 504 పరుగులు చేశారు. ఆయన సగటు 56.00 కాగా, స్ట్రైక్ రేట్ 148.67. అయితే, ముంబైతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు రాహుల్ సహా తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. మిచెల్ శాంట్నర్, జస్‌ప్రీత్ బుమ్రా తలదన్నలేని బౌలింగ్‌తో ఢిల్లీ పతనాన్ని ప్రారంభించారు. మిగతా బ్యాటర్లు కూడా ఒత్తిడికి లోనై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 59 పరుగుల తేడాతో ఓడింది. కేఎల్ రాహుల్ ఇటువంటి ఘనత సాధించినప్పటికీ, జట్టు విజయం మాత్రం అతనికి దక్కలేదు. అయినప్పటికీ, వ్యక్తిగతంగా 500+ పరుగులతో మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్న రాహుల్, ఐపీఎల్‌లో తన స్థిరతను మరోసారి నిరూపించారు. మొత్తంగా కేఎల్ రాహుల్ బ్యాట్ తో దరగొట్టిన తన టీం మాత్రం ప్లేఆప్స్ కు చేరడంలో విఫలమైంది.