పాపం.. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే "శ్రేయ్యాస్ అయ్యార్" పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయుండేది .  ఇన్నాళ్లు కష్టపడి బాగా అన్ని మ్యాచ్ లల్లో ఆడి తన ఆట తీరుని రోజు రోజుకి హైలైట్ అయ్యే విధంగా చేసుకున్న శ్రేయాస్ అయ్యారు ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్లో మాత్రం దారుణతి దారుణమైన డిజాస్టర్ పర్ఫామెన్స్ చూపించారు.  కేవలం ఒక్కటంటే ఒక్క రన్ మాత్రమే తీసి అవుట్ అయ్యాడు . అసలు పంజాబ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం శ్రేయస్ అయ్యారే అంటూ కూడా చాలా మంది ఆయనని ట్రోల్ చేస్తున్నారు.  శ్రేయాస్ అయ్యార్ సింపుల్ బాల్ ని టచ్ చేయకుండా ఉండి ఉంటే ఆయన వికెట్ పడి ఉండేదే కాదు అని కచ్చితంగా శృఏయ్యాస్ అయ్యార్ తనదైన పర్ఫామెన్స్ లో ఆకట్టుకునేవాడు అని.. శ్రేయ్యాస్ అయ్యార్ అత్యుత్సాహంతోనే ఆ బాల్ ని టచ్ చేసి అవుట్ అయ్యాడు అని .. దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు .


అంతేకాదు శ్రేయస్ అయ్యార్ ఆస్తి డీటెయిల్స్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.  30 సంవత్సరాల వయసులో అటు ఆర్థికపరంగా ఇటు వృత్తిపరంగా శ్రేయాస్ అయ్యార్ బాగా సెటిల్ అయిపోయాడు అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . ఐపీఎల్ మైదానంలో ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడు అందరికీ తెలిసిందే . ఇప్పుడు ఆయన ఆస్తికి సంబంధించిన డీటెయిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . 2015లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో 2.6 కోట్లకు తన ఐపిఎల్ కెరీర్ ను ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ 2025లో పంజాబ్ కింగ్స్ అతన్ని రికార్డు స్థాయిలో 26 . 75 కోట్లకు కొనుగోలు చేసింది . ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అయిన ఖరీదైన ఆటగాడి ఒప్పందంలో ఇదొకటి అని ఇక్కడ జనాలు గుర్తుపెట్టుకోవాలి.



1994 డిసెంబర్ 6 ముంబైలో జన్మించిన శ్రేయస్ అయ్యార్ దేశంలో అత్యంత బహుముఖ ప్రజ్ఞాశాలి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మ్యాన్ లల్లో ఒకరుగా గుర్తింపు పొందాడు . అంతేకాదు శ్రేయాస్ అయ్యార్ టోటల్ ఆస్తి గురించి తెలిస్తే షాక్ అయిపోవాల్సిందే. అతడి దగ్గర ఉన్న లగ్జరీ కార్లు బోలెడు. దాదాపు 7కు పైగా ఆయన దగ్గర లగ్జరీ కార్లు ఉన్నాయి.  అంతేకాదు ముంబైలో లోధా వరల్డ్ టవర్స్ లో 14 కోట్ల విలువైన ఫ్లాట్ కూడా ఉంది . అల్ట్రా లగ్జరీ ఆస్తులను కలిగి ఉన్న భారతీయ క్రీడా ప్రముఖులలో శ్రేయాస్ అయ్యారు కూడా ఒకడు . నివేదికల ప్రకారం అయ్యార్ టోటల్ ఆస్తి 95 కోట్లకు పైగానే ఉంటుంది అంటూ టాక్ వినిపిస్తుంది. శ్రేయ్యాస్ కు ఉన్న క్లీన్ ఇమేజ్ ఆర్డర్లో విజయాలు ఆయన ఆస్తి పెరగడానికి కూడా కారణమయ్యాయి అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: