
అయితే ఇది జనాలకి బాగా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . మహమ్మద్ షమ్మీ పెద్ద క్రికెటర్ . కోట్ల ఆదాయం ఆయనకి వస్తుంది . మరి అలాంటిది తన మాజీ భార్యాబిడ్డ కోసం కేవలం నాలుగు లక్షల మాత్రమేనా ..?? ఇందులో 1.5 లక్షలు భార్య హసీనా కోసం అదేవిధంగా 2.5 లక్షలు బిడ్డ కోసం చెల్లించాలి అని కోర్టు పేర్కొంది . ఒక్కసారిగా సోషల్ మీడియాలో షమ్మీపై నెగిటివిటీ స్టార్ట్ అయింది . అసలు ఎందుకు నాలుగు లక్షల మాత్రమే ఇవ్వాలి ..? ఒక పది పదిహేను లక్షలు ఇవ్వచ్చు కదా..? వాళ్ళ లైఫ్ బాగుంటుంది కదా..? అంటూ మాట్లాడుకునే జనాలు కూడా ఉన్నారు . దీనిపై షమ్మీ మాజీ భార్య స్పందించింది .
" ఇన్నాళ్ల మా పోరాటానికి న్యాయం జరిగింది అంటూ తెలిపింది . అంతేకాదు షమ్మీ రేంజ్ కి ఇది చాలా చాలా తక్కువ అని మేము 10 లక్షల వరకు కోరామని కానీ కోర్ట్ నాలుగు లక్షల వరకే ఒప్పుకునింది అని చెప్పుకొచ్చింది. మేము చేసిన పోరాటంలో విజయం దక్కింది కానీ 10 లక్షలు ఇవ్వాలని అడిగాం అతడి ఆదాయం ఖర్చులు అన్నీ మీకు తెలుసు.. షమ్మి రేంజ్ అంతా కూడా మీకు తెలుసు. షమ్మీ ఎలా జీవితాన్ని గడుపుతున్నారో మేము అలాగే గడపాలిగా " అంటూ జహాన్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు జనాలు కూడా ఇదే విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు .
కోట్లు సంపాదిస్తున్న షమ్మీ మాజీ భార్య తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ కోసం కేవలం 4 లక్షలు మాత్రమే ఇస్తే ఎలా సరిపోతుంది..? స్కూల్ ఫీజు ఇతర ఖర్చులన్నీ ఎలా మేనేజ్ అవుతాయి..? అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు . కొంతమంది షమ్మి రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని.. ఆ కారణంగానే డబ్బులు దాచి పెట్టుకుంటున్నాడు అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరి కొంతమంది మాత్రం తన కూతురు భవిష్యత్తు కోసం ఏదో ఒక ప్లాన్ చేస్తుంటాడు అని కావాలని తన మాజీ భార్య షమ్మీపై నెగిటివిటి క్రియేట్ చేస్తుంది అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . మొత్తానికి సోషల్ మీడియాలో షమ్మికి ఉన్న పాజిటివిటి మొత్తం ఈ ఒక్క కారణంగా నెగిటివ్గా మారిపోయింది . చూడాలి మరి షమ్మి ఈ నెగిటివిటీని ఎలా పాజిటివ్ గా మార్చుకుంటాడో...???