
ఇదిలా ఉండగా తాజాగా మరో జబర్దస్త్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న రాకింగ్ రాకేష్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో కిర్రాక్ ఆర్ పి పై సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంటర్వ్యూలో భాగంగా హోస్ట్ ప్రశ్నిస్తూ.. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సక్సెస్ అవ్వడానికి కారణం జబర్దస్త్ అని మీరు అంటారా? అంటూ సూటిగా అడిగారు. ఈ విషయంపై రాకేష్ స్పందిస్తూ.. "ఎవరు చేసినా అది జబర్దస్త్ పుణ్యమే.. మల్లెమాల భిక్ష " అంటూ ఓపెన్ గా చెప్పేసాడు రాకేష్.
కానీ ఇటీవల కాలంలో మీరు ఆర్పిని కలిసారా ? అని అడగగా.. " మాకు అంత అదృష్టం ఇంకా రాలేదు.. వాళ్లేదో పెద్దవాళ్ళు.. మేము చిన్న చిన్న ఆర్టిస్టులము" అంటూ వ్యంగంగా స్పందించారు.. అంతేకాదు ఇదే రకంగా హోస్ట్ అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఘాటుగా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు రాకేష్.. మొత్తానికైతే కిరాక్ ఆర్పి రాకింగ్ రాకేష్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి అనే వార్తలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి. మరి ఇది దేనికి దారి తీస్తుందో ఎప్పుడు ఎండ్ అవుతుందో అనేది తెలియాల్సి ఉంది.