ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబర్ గా నటుడుగా డాన్సర్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్లలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు.ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చి విన్నర్ కాలేకపోయారు.. ఎప్పుడు చూడడానికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తున్న షణ్ముఖ్.. అసలు నిజం ఈ రోజున బయటపడింది. గతంలో 2021లో ఒకసారి కారు అతివేగంగా నడిపి ప్రమాదానికి గురయ్యారు.ఈ ప్రమాదంలో కొంతమంది గాయాల పాలయ్యారు.. అయితే ఆ సమయంలో ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువగా ఉండడం చేత పెద్దగా కేసు నమోదు కాలేదు.


అయితే ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ కేసులో ఒక్కసారిగా బుక్ కావడం చేత షణ్ముఖ్, దీప్తి గురించి పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. షణ్ముఖ అన్నయ్య సంపత్ చేతిలో మోసపోయిన ఒక యువతి కంప్లైంట్ ఇవ్వడం చేత షణ్ముఖ్ గంజాయి తాగుతున్నాడు అనే విషయం వెలుగులోకి వచ్చేసింది.. మౌనిక అనే యువతీతో సంపత్ కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్నారని.. ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆమెను అన్ని విధాలుగా వాడుకున్నారట తీర ఆమెను కాకుండా మరొక అమ్మాయిని కూడా వివాహం చేసుకోవడంతో ఆమె వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో సంపత్ ఉండే రూము దగ్గరకి పోలీసులు వెళ్ళగా అక్కడ సంపత్ తన తమ్ముడు షణ్ముఖ్ గంజాయి తాగుతూ బుక్ అయిపోయారు.


అలాగే తన షార్ట్ ఫిలిస్ ,వెబ్ సిరీస్లలో కూడా మౌనికాకు అవకాశాలు ఇస్తానని షణ్ముఖ్ ప్రామిస్ చేశాడట.. షణ్ముఖ్ అన్నయ్య సంపత్ ఈమెను వాడుకొని ఒకసారి అబార్షన్ కూడా చేయించారట. అయితే ఇలాంటి విషయాలన్నీ దీప్తి కి తెలియడంతో అతనితో బ్రేకప్ చెప్పేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బిగ్ బాస్ లో కూడా ఒక అమ్మాయి తో కాస్త చనువుగా ఉండడంతో దీప్తికి నచ్చకపోవడంతో పాటు షణ్ముఖ గురించి అసలు విషయాలు తెలుసుకొని షణ్ముఖ్ నుంచి దీప్తి విడిపోయిందంటూ పలువురి నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: