
రీతు చౌదరి మాట్లాడుతూ తాను బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోషన్స్ చేయలేదని చెప్పను..చేశాను కానీ చేసింది ఎన్ని అనేది కూడా చూడాలిగా తాను ప్రమోషన్ చేసినట్లు ఇష్టం వచ్చినట్లుగా ఎవరూ రాయవద్దు.. దాని గురించి తనకు తెలియనప్పుడు చేశానని తెలిశాక అసలు చేయలేదని తెలిపింది రీతూ చౌదరి.. తాను ఒకటి రెండింటిని మాత్రమే ప్రమోట్ చేశానని అన్నిచోట్ల కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని.. ఆ విషయం తప్పు అని తనకు ఎలా తెలుస్తుందని అందుకే తెలియకనే చేశాను కాబట్టి మళ్ళీ తప్పు చేశానని వీడియోను కూడా పెట్టానని తెలియజేసింది.
అంతేకాకుండా ఇక మీదట ఎవరు ఇలాంటివి చేయకూడదని చెప్పాము.. కానీ కొంతమంది సెలబ్రిటీల మీద చాలా తప్పుగానే ప్రమోట్ చేస్తూ ఉన్నారని రాస్తున్నారని తెలిపింది. బెట్టింగ్ యాప్స్ లలో లక్షలలో కోట్లలో ఏమి రావు మధ్యలో కూడా చాలామంది ఉంటారు. ఆ ప్రమోషన్స్ తన దగ్గరికి వచ్చేసరికి కేవలం 50 వేల రూపాయలు మాత్రమే మిగులుతుందంటూ తెలియజేసింది రీతు చౌదరి.కోట్లకు కోట్ల రూపాయలు సంపాదించారని బెట్టింగ్ యాప్స్ వల్లే ఇదంతా సాధ్యమైందని మాట్లాడుకునే వారందరికీ కూడా రీతూ చౌదరి క్లారిటీ ఇచ్చేసింది. మొత్తానికి రీతూ చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.