
సినీ సెలబ్రిటీల జాతకాలను తెలియజేస్తూ బాగానే పేరు సంపాదించారు వేణు స్వామి. ఒకానొక దశలో వేణు స్వామికి అపాయింట్మెంట్ దొరికేది కూడా కష్టంగా మారేది. అయితే ఇటీవలే కాలంలో జ్యోతిష్య లు రాజకీయంగా మారడంతో ఈ రాజకీయాల వల్ల వేణు స్వామి జ్యోతిష్యం బెడిసి కొట్టింది. ఇప్పటికే వేణు స్వామితో రష్మిక, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి తదితర హీరోయిన్స్ కూడా తమ కెరియర్ ను నిలదొక్కుకోవడం కోసం పూజలు చేయించుకున్నారు.
ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అషు రెడ్డి తో ప్రత్యేకించి పూజలు చేస్తూ ఉన్నట్లుగా వేణు స్వామి కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. కామాఖ్య ఆలయానికి తీసుకువెళ్లి మరి అక్కడ పూజలు చేయించి ఆశీర్వదించినట్లు తెలుస్తోంది.అషు రెడ్డి వెంట ప్రముఖ బుల్లితెర నటి ప్రవీణ కడియాల కూడా ఉన్నది...అషు రెడ్డి కెరియర్ అంతంత మాత్రమే ఉండడంతో తన కెరియర్ ముందుకు సాగాలని ప్రత్యేకించి మరి ఇక్కడ పూజలు చేయించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి వీడియోలను, ఫోటోలను కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది అషు రెడ్డి. అప్పట్లో సినిమా అవకాశాల కోసం .అషు రెడ్డి తో రాజశ్యామలాదేవి పూజలు కూడా చేయించారు.. దీంతో పలు సినిమాలలో కూడా నటించడానికి అవకాశాలు వచ్చినట్లుగా వార్తలు వినిపించాయి. మరి ఇప్పుడు మరొకసారి చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.