జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరకు కమెడియన్గా పరిచమయ్యి ఆ తర్వాత సినిమాలలో కమెడియన్ గా అదరగొట్టేస్తున్న హైపర్ ఆది గురించి చెప్పాల్సిన పనిలేదు. మొదట అదిరే అభి టీమ్ లో కమెడియన్గా చేసిన ఆది ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే టీమ్ లీడర్ గా ఎదిగారు. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తూ వెండితెర పైన కూడా ఒక వెలుగు వెలుగుతున్నారు హైపర్ ఆది. అంతేకాకుండా అల్లరి నరేష్ నటించిన ఒక సినిమాకి డైలాగ్ రైటర్ గా కూడా పనిచేశారు. ఆ తర్వాత తొలిప్రేమ, సవ్యసాచి, మజ్ను, వెంకీ మామ, ధమాకా, మజాక తదితర చిత్రాలలో కామెడీ అనగా నటించారు.


మరొకవైపు బుల్లితెరపై కమెడియన్ గా అందరిని నవ్విస్తున్న హైపర్ ఆది ఏం చదువుకున్నారనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. తాజాగా హైపర్ ఆదికి సంబంధించి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. హైపర్ ఆది మార్క్ లిస్ట్ లో వచ్చిన మార్కులు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు..హైపర్ ఆది మొత్తం 600 మార్కులకు గాను 534 తెచ్చుకున్నారు. అనంతరం ఈ విషయం పైన హైపర్ ఆది మాట్లాడుతూ తాను ఏడవ తరగతిలో కూడా స్కూలు టాపార్ అని ఇప్పటికీ తాను చదివిన స్కూల్ కి వెళితే అక్కడ కోట ఆదయ్య అనే పేరు ఉంటుందంటూ తెలిపారు.


తన అసలు పేరు అదేనని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత హైపర్ ఆదిగా పరిచయమై పేరు మార్చుకున్నాను అంటూ తెలిపారు. పదవ తరగతిలో తాను స్కూల్ సెకండ్ వచ్చానని ఆ తర్వాత ఇంటర్, బీటెక్ లో కూడా మంచి మార్కులు వచ్చాయంటూ తెలియజేశారు. ఇంటర్లో 1000 కి 945 మార్కులు వచ్చాయని వెల్లడించారు. చదువు పూర్తి అయిపోయిన తర్వాత ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసి నటన పైన ఇష్టం ఉండడంతో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం స్టార్ కమెడియన్గా పేరు సంపాదించారు హైపర్ ఆది.

మరింత సమాచారం తెలుసుకోండి: