ప్రస్తుతం అందరూ వాట్సాప్ ను బాగానే ఉపయోగిస్తున్నారు.. అయితే కొంతమంది తమ కుటుంబ సభ్యుల, ఫ్రెండ్స్, ఇతరుల కోసం కొన్ని గ్రూపులను కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు.అయితే అలా గ్రూపులను క్రియేట్ చేసేటప్పుడు.. అడ్మిన్ ల గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి.. అడ్మిన్ కు కొన్ని చట్టపరమైన హక్కులు కూడా ఉంటాయట. ఇక వాటితో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయట. అలా క్రియేట్ చేసిన ఏదైనా గ్రూపులలో చట్టానికి సంబంధం లేని పనులు చేసినప్పుడు అలాంటివి నియంత్రించడం అడ్మిన్ యొక్క బాధ్యత. నిషేధిత కంటెంట్ ఉన్న షేర్ చేస్తే కొన్ని సార్లు జైలుకు కూడా వెళ్ళవలసి వస్తుందట. ప్రస్తుతం అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

1). ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులలో దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి వాటిని షేర్ చేయకూడదు. అలా షేర్ చేసిన వ్యక్తి తో పాటు గ్రూప్ అడ్మిన్ కూడా చట్టపరంగా శిక్షించ వలసి ఉంటుందట.

2). మీరు ఇతరుల నుంచి వారి యొక్క పర్సనల్ వీడియోలను వ్యక్తిగత ఫోటోలను గ్రూపులో షేర్ చేయవద్దు. ఇలాంటివి ఎక్కువగా నేరాల పరిధి కిందికి వస్తాయి. అందుచేతనే ఇలాంటి చేసేవారి పైన కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకోబడతాయి.

3). ఇక ఆ తరువాత వాట్సాప్ లో ఏ మతాన్ని అయినా కించపరిచే విధంగా ఫోటోలను, వీడియోలను చిత్రీకరించడం, హింసను రెచ్చగొట్టే విధంగా చేయడం చాలా తప్పు.. ఇలాంటివి చేసినచో జైలుకు వెళ్ళవలసి ఉంటుంది.

4). వాట్సప్ గ్రూపులలో ముఖ్యంగా చిన్నపిల్లల అశ్లీలత వీడియోలు, వ్యభిచారానికి సంబంధించిన మెసేజ్ లను షేర్ చేయడం, అసభ్యకరమైన విషయాలను షేర్ చేయడం.. నేరం కిందికే వస్తాయి.

అయితే ప్రస్తుతం ఎక్కువగా ఫేక్ న్యూస్ వంటివి స్ప్రెడ్ అవుతున్నాయి.. అందుచేతనే ప్రభుత్వం కూడా వారి మీద చాలా కఠినంగా వ్యవహరించే విధంగా కొన్ని రూల్స్ లను తీసుకొస్తోంది ఇక మీదట నకిలీ రాయుళ్లకు చెక్ పెట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: