ప్రతి ఒక్కరం మొబైల్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాము ముఖ్యంగా పలు రకాల అప్డేట్లు కూడా అందులో వస్తూ ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ అప్డేట్ విషయంలో కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు.. సాఫ్ట్వేర్ అప్డేట్ విషయంలో ఏమాత్రం సమయం తీసుకోవద్దని నిపుణులు తెలుపుతున్నారు. వాస్తవానికి మీ స్మార్ట్ ఫోన్లో నేరుగా కనిపించే సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట.. కొంతమంది స్మార్ట్ మొబైల్స్ వినియోగదారులు సాఫ్ట్వేర్ అప్డేట్లను పూర్తిగా విస్మరిస్తూ ఉంటారు. దీంతో కొన్ని సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ అప్డేట్లను చేయకుండా ఉంటారు.


ఇలా అప్డేట్ చేయకుండా ఉండడంవల్ల స్మార్ట్ మొబైల్ స్టోరేజ్ చాలా స్పేస్ దొరుకుతుందని భావిస్తూ ఉంటారు. అయితే స్మార్ట్ మొబైల్ అప్డేట్ చేయకపోవడం వల్ల పలు నష్టాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి.. ముఖ్యంగా స్మార్ట్ మొబైల్స్ సాఫ్ట్వేర్ చాలా కాలంగా అప్డేట్ చేయకపోతే స్మార్ట్ మొబైల్ లోని మదర్ బోర్డ్ దెబ్బతిని పూర్తిగా నిలిచిపోతుంది. ఆ తర్వాత స్మార్ట్ మొబైల్ పనిచేయదు.

సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినప్పుడల్లా స్మార్ట్ మొబైల్ స్పీడ్ పెరుగుతుంది. ఈ స్పీడ్ పెరగడం వల్ల హీటింగ్ సమస్య కూడా తగ్గుతుంది.. ఒకవేళ స్మార్ట్ ఫోన్ అప్డేట్ చేయకపోతే మొబైల్ వేడెక్కడం ఇతర సమస్యలు కూడా వస్తాయట.

స్మార్ట్ మొబైల్స్ సాఫ్ట్వేర్ అప్డేట్లను చేయలేకపోతే మల్టీ టాస్కింగ్ చేయలేరు.అలాగే గేములు కూడా ఆడడం వీడియోలను చూడడం వంటివి సమస్యలు కూడా ఎదుర్కొంటారట.

సాఫ్ట్వేర్ మొబైల్లో అప్డేట్ చేయకపోతే పలు రకాల సమస్యలు వస్తాయట ఇందులో ముఖ్యంగా ఓవర్ హీటింగ్ సమస్య వల్ల ప్రాసెస్ అప్డేట్ కాకపోవడం వల్ల మొబైల్స్ లో అవ్వడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా మొబైల్ హీట్ ఎక్కడం వల్ల బ్యాటరీ పై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది దీనివల్ల బ్యాటరీ వేడి ఎక్కువగా అయ్యి మొబైల్ పేలి అవకాశం కూడా ఉంటుందట. అందుకే ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ మొబైల్ లోనే ప్రతి అప్డేట్ ను కూడా అప్డేట్  చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: