ఆసూస్ బ్రాండ్ నుంచి విడుదలైన asus ROG సిరీస్ మోడల్ కలిగిన మొబైల్ ఇండియాలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.. ఈ మోడల్ గల మొబైల్స్ ప్రత్యేకమైన డిజైన్లో మరియు సరికొత్త ఫీచర్లతో లభిస్తున్నాయి.అందుకే ఆసూస్ కంపెనీకి చెందిన ఈ మోడల్స్ కొనుగోలు చేసేందుకు చాలామంది ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ సందర్భంగా asus ROG -8 సిరీస్ కలిగిన మొబైల్ జనవరి 8వ తేదీన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు పలువురు నిపుణులు తెలుపుతున్నారు.. ఆసూస్ సంస్థ ఇటీవలే ఒక సరికొత్త మొబైల్ టీజర్ ని కూడా విడుదల చేసింది.


ASUS ROG 8 ఫీచర్స్:
ఆసూస్ రోగ్ 8 మోడల్ కలిగిన మొబైల్..HD ప్లస్ డిస్ప్లే తో పాటు..6.78  అంగుళాలు కలదు. ఈ మొబైల్ లో డిస్ప్లే HDR -10 సపోర్టుతో పనిచేస్తుంది.. ఈ మొబైల్ యొక్క డిస్ప్లే ప్రత్యేకమైన స్క్రీన్ అనుభూతిని సైతం అందిస్తుందట. అలాగే గొరిల్లా గ్లాస్ విక్టస్ -2 రక్షణ కూడా లభిస్తుంది. ఈ మొబైల్ మూడు వేరియంట్లలో లభిస్తుంది..12GB RAM+256 GB..16 RAM+512 GB.24GB RAM+1 tb స్టోరేజ్ కలిగిన మొబైల్స్ సైతం అందుబాటులో ఉంటాయి.


ఈ ఆసూస్ రోగ్ -8 మొబైల్ సోనీ బ్యాక్ సైడ్ కెమెరా తో 50 mp కలదు.. వీటితోపాటు 13 MP+32 mp త్రిబుల్ కెమెరా సెటప్ కలదు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ సెటప్ తో కలదు. ఈ చిప్ సెట్ వేగవంతమైన పనితీరు కోసం పనిచేస్తుంది. అలాగే గేమింగ్ ఎడిటింగ్ వీడియోస్ వంటి యాప్స్ లు చాలా సులువుగా ఉపయోగించుకోవచ్చు.. అలాగే ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఈ మొబైల్ పనిచేస్తుంది.. ఈ మొబైల్ డస్ట్ మరియు స్లాబ్ రెసిస్టెంట్ ఆధారంగా కూడా పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5500 MAH సామర్థ్యంతో పనిచేస్తుంది. ఈ మొబైల్ రీఛార్జ్ సపోర్టుతో 5జి మొబైల్ తో టైప్ సి చార్జింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది. ఇండియాలో ఈ మొబైల్ ధర కాస్త ఎక్కువగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: