సోషల్ మీడియా అందరికీ అందుబాటు లోకి వచ్చిన తర్వాత నేటిజన్స్ దృష్టిని ఆకర్షించేందుకు ఎంతో మంది చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఇక అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక ఇలా ఇంటర్నెట్లో ప్రత్యక్షమైన కొన్ని వీడియోలు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్య పోయేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక మరికొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తూ ఉంటాయి.


 ఇక ఇప్పుడు ఓ తండ్రి కొడుకులు చేసిన పని కూడా నెట్టింట్లో  అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది ఎలా సాధ్యమైంది అని ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు అని చెప్పాలి. సాధారణం గా హెయిర్ కట్ ఎలా చేయించుకుంటారు అందరికీ తెలిసే ఉంటుంది. కత్తెరతో హెయిర్ కట్ ని మనకు కావాల్సినంత కట్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.  ఇక ఇటీవల కాలం లో హెయిర్ ట్రిమ్మర్స్ తో స్టైల్ చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకం గా ఒక టేబుల్ స్పూన్ తో కుమారుడు జుట్టు కత్తిరించాడు అని చెప్పాలి.

 ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది. అయితే కేవలం టేబుల్ స్పూన్ తోనే ఇక తనకు కావలసిన రీతిలో ఇక కుమారుడు జుట్టును కత్తిరించి కొత్త హెయిర్ స్టైల్ చేయడం ఈ వీడియో లో చూడవచ్చు. ఈ క్రమంలోనే ఇది ఎలా సాధ్యమైందో తెలియక నేటిజన్స్ అందరూ తలగోక్కుంటున్నారు. అంతే కాదు ఇక అతని అద్భుతమైన ప్రతిభ ని కూడా మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు అని చెప్పాలి. ఇకపై తాము రేజర్ కొనబోమని ఇలా టేబుల్ స్పూన్ తోనే హెయిర్ కటింగ్ చేయించుకుంటామంటు మరి కొంతమంది  కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vir