ఇక సోషల్ మీడియాలో  ప్రతిరోజూ కూడా ఎన్నో రకరకాల వైరల్ వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి.అవి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా వాటిలో వివిధ రకాల జంతువుల వీడియోలు ఎక్కువగా ఉంటాయి. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. అయితే ఏనుగు, సింహం ఒకే ఫ్రేమ్‌లో ఉండటం మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయి.అడవికి రాజు సింహమే అయినా ఏనుగు, సింహం మధ్య జరిగే పోరాటంలో మాత్రం మృగరాజు ఎక్కువగా ఓడిపోతుంటుంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఒక్కసారి ఏనుగుకు కనుక కోపం వస్తే దాన్ని ఆపడం చాలా కష్టం. దానికున్న ఆకారానికి ఏ జంతువు అయిన భయపడాల్సిందే. ఇక అలంటి ఏనుగు, సింహం షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ చక్కర్లు కొడుతూ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే నిజంగా ఎవ్వరైనా ఖచ్చితంగా షాక్ అవుతారు.ఇక తాజాగా వైరల్ అవుతోన్న ఈ వీడియోలో సింహం, ఏనుగు ఒకేసారి నీళ్లు తాగడానికి వచ్చాయి. 


అయితే ఈ వైరల్ వీడియోలో మీరు అడవిలో బావి పక్కన పడి ఉన్న సింహాన్ని చూడవచ్చు.అయితే అకస్మాత్తుగా దాహంతో ఉన్న ఏనుగు ఒకటి అక్కడకు వస్తోంది. బావి దగ్గరకి అది చేరుకోగానే ఏనుగు నీటిని తాగుతూ కనిపించింది. ఇక ఏనుగు ను చూసిన సింహం అక్కడే పొంచి ఉంది. సరైన సమయం చూసి దాని పై దాడి చేయాలని ఆ సింహం ఎదురుచూసింది. తొండంతో నీళ్ళు తాగుతుండగా ఏనుగు చూపు ఆ సింహం మీద పడింది. సింహం తనపై దాడి చేసేందుకు పొంచి ఉందని భావించిన ఆ ఏనుగు ఇక దాని పై కోపంతో విరుచుకుపడింది. ఇక అది సింహంపై దాడి చేసేందుకు ముందుకు దూసుకెళ్లడం మనం వీడియోలో చూడొచ్చు.ఇక ఆ ఏనుగు భీకర రూపాన్ని చూసి సింహం ఎంతగానో భయపడిపోయింది. ఇక కోపాన్ని అదుపు చేసుకోలేక ఏనుగు అరుస్తూ ఆ సింహంపైకి వెళ్ళింది.ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇంకా ఈ వైరల్ వీడియో లేటెస్ట్ సైటింగ్స్ పేరుతో యూట్యూబ్ ద్వారా షేర్ చేయబడింది. ఈ వీడియోకి ఇప్పటిదాకా 6.5 మిలియన్ల పైగా వ్యూస్ అలాగే 22 k పైగా లైక్‌లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: