సాధారణంగా వినాయక విగ్రహం అనగానే చిత్తూరు జిల్లాలోని కాణిపాకం లో, స్వయంభూగా వెలసిన శ్రీ మహా వినాయకుడు అందరికీ గుర్తొస్తాడు..కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటిదే ఒక అత్యంత ప్రాముఖ్యత పొందిన వినాయక విగ్రహం ఉందట.అంతే కాదు అది ఒక గణేశ ప్రతిమ అని ప్రచారంలో ఉంది. భారతదేశంలోని అతి పెద్ద ఏకశిలా విగ్రహం గా గుర్తింపు పొందుతోంది. అక్కడి ప్రజలు ఆ ఏకశిలా విగ్రహ వినాయకుడిని ఐశ్వర్య గణపతి గా కొలుస్తూ.. భక్తుల చేత పూజలందుకుంటున్నాడు వినాయకుడు..


ఇకపోతే ఈ విగ్రహం తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో తిమ్మాజీపేట మండలం ,ఆవంచ గ్రామంలో  ఉన్న పంట పొలాల మధ్య ఒక భారీ గణేశ ప్రతిమ అందరిని చాలా విశేషంగా ఆకర్షిస్తోంది.. అయితే ఈ విగ్రహం భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నప్పటికీ అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలోనే ఉందని చెప్పాలి.. ఇప్పటివరకు ప్రభుత్వం దృష్టిలో పడని ఈ ఏకశిలా విగ్రహం గురించి ఒకసారి తెలుసుకుందాం.

ఆవంచ గ్రామంలో పంట పొలాల మధ్య ఉన్న ఈ ఏకశిలా విగ్రహం 15 అడుగుల వెడల్పు ,25 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ గ్రామంలో ఉన్న భక్తులు ఈ స్వామిని గుండు వినాయక అని కూడా పిలుస్తూ ఉంటారు. అంతే కాదు మరి కొంతమంది వెంకయ్య అని కూడా పిలుస్తూ ఉంటారట. ఇంత భారీ విగ్రహాన్ని ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు.. కనీసం ఒక గోడ కూడా లేదు. ఎండకు ఎండాల్సిందే..వానకు వానాల్సిందే.. కానీ అక్కడ ఉన్న పచ్చటి పొలాలు ఆయనకు ఆభరణం. ఇక ఆ పంట పొలాల రైతులే ఆయనకు భక్తులు. వారు పెట్టె  ఎప్పుడో ఒక పండు తోనే ఆయన అంత పెద్ద భారీ కడుపును నింపుకోవాల్సి వస్తోంది.


దాదాపు పది సంవత్సరాల క్రితమే ఈ భారీ వినాయకుడు వెలుగులోకి వచ్చినప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అంతే కాదు స్థానిక నాయకులు కూడా వినాయకుడు ఉన్నాడన్న గుర్తే లేదు. మైసూర్ కు సంబంధించిన వేదపండితుల మాత్రం ఎన్నో పూజలు చేసి ఐశ్వర్య గణపతి గా నామకరణం చేయడం జరిగింది. వినాయక చవితి రోజు మాత్రమే ఈ వినాయకుడు పూజలందుకుంటాడు.. కానీ ఈ దేవుడికి గుడి కట్టడం అనేది ఎవరు చేస్తారో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: