పెళ్లి జ‌రిగిన తొలి రోజు త‌రువాతనే భార్య పారిపోవడంతో భర్తకు గుండెపోటు వచ్చిన ఘటన కేరళలో  చోటు చేసుకున్న‌ది.  కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో వివాహమైన‌ మరుసటి రోజునే భార్య త‌న ప్రియురాలితో కలిసి పారిపోయింది. ఈ విషయం తెలిసిన  భర్తకు గుండెపోటు వచ్చింది. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా యాంజియోప్లాస్టీ చేసారు.  త్రిస్సూర్‌లోని చెర్పు సమీపంలోని పజువిల్‌కు చెందిన 23 ఏళ్ల యువ‌తికి చవక్కాడ్‌కు చెందిన ఓ వ్యక్తితో అక్టోబర్ 25న వివాహం జ‌రిగిన‌ది.ఆ తర్వాత రోజు భార్యాభర్తలు ఇద్ద‌రు క‌లిసి బ్యాంకు వ‌ద్ద‌కు వెళ్లారు. బ్యాంకుకెళ్లి న స‌మ‌యంలోనే   భర్త మొబైల్ నుంచి ప్రియురాలికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది భార్య.  బయటకు వెళ్లి వెంట‌నే వస్తానని భర్తతో చెప్పి వెళ్లిపోయింది. భార్య కోసం భ‌ర్త ఆరోజు సాయంత్రం వరకు బ్యాంకు వద్దే వేచి ఉన్నాడు. త‌న భార్య రాక‌పోవ‌డంతో ఆశ్చ‌ర్యానికి గురై చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ భ‌ర్త‌. 

పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టడం మొద‌లు పెట్టారు.  ఆరు రోజులు గ‌డిచిన త‌రువాత  మ‌ధురైలో  ఆమెతోపాటు ఆమె ప్రియురాలును కూడ పట్టుకున్నారు పోలీసులు.  వారిరువురిని విచారించగా విస్తుపోయే విష‌యాలు  వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి ముందే తన ప్రియురాలితో పారిపోవాలనుకున్నానని,   తన తల్లిదండ్రుల ఇచ్చే బంగారు ఆభరణాల కోసం వేచి చూశానని చెప్పింది ఆ యువ‌తి.  ఆమె ప్రియురాలితో కలిసి త్రిసూర్‌ నుంచి చెన్నైకి రైలు టికెట్‌ బుక్‌ చేసినట్టు విచారణలో వెల్ల‌డైంది.  రైలులో ప్ర‌యాణించకుండా  వారు బస్సులో కొట్టాయంకు వెళ్లారు. మరుసటి రోజు చెన్నై వ‌ర‌కు రైలు ఎక్కారు. ఆ త‌రువాత  చెన్నై నుంచి మధురై వెళ్లి అక్కడ ఓ హోటల్‎లో బస చేసారు.  అక్కడ వారు ఒక రోజు గడిపారు.

ద్విచ‌క్ర వాహ‌నంపై ఎర్రాకులం వెళ్లి 10 రోజుల పాటు అడ్వాన్స్ చెల్లించి వ‌స్తువులను అక్క‌డే ఉంచి తిరిగి మ‌ధురై వ‌చ్చారు. మ‌ధురైలోని ఓ వ‌స్త్ర దుకానంలో ఉద్యోగాలు చేస్తూ త‌మ జీవితాన్ని గ‌డ‌పాల‌ని నిశ్చ‌యించుకున్నారు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే ఆమె ప్రియురాలు కూడ నూత‌నంగా పెళ్లి అయిన మ‌హిళే కావడం విశేషం బంగారు ఆభ‌రణాల‌ను తీసుకొని పారిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డి అయింది. ఈ విష‌యం తెలిసిన భ‌ర్త గుండెపోటు వ‌చ్చిన‌ది. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: