సాధారణంగా పోలీసులను చూస్తే సామాన్యులు అందరూ కూడా భయపడిపోతుంటారు అన్న విషయం తెలిసిందే. పోలీసులకు అధికారం ఉంటుంది. కాబట్టి ఇక వాళ్ళ జోలికి వెళ్తే ఏదైనా చేస్తారేమో అని కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు.  కానీ కొంతమంది మాత్రం పోలీసుల అక్రమాలను ఎంతో ధైర్యంగా ప్రశ్నించడం లాంటివి కూడా చూస్తూ ఉంటారూ. అయితే ఇలా పోలీసులు కాస్త అతి చేస్తే ప్రశ్నిస్తారు కానీ ఎవరూ పోలీసులపై చేసుకోవడానికి మాత్రం ధైర్యం చేయరు అని చెప్పాలి. ఒకవేళ ఇలాంటి ధైర్యం చేసిన ముసుగు వేసుకుని పోలీసుల పై చేయి చేసుకోవడం తర్వాత కనిపించకుండా పారిపోవడం లాంటివి చేసిన వీడియోలు అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోతాయి.


 కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఒక పోలీసును చితకబాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఉత్తరప్రదేశ్లోని మోయిన్ పూరీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది పోలీసులు విచారించడానికి పిలిచిన వ్యక్తి చివరికి అదే పోలీసులపైనే దాడి చేశాడు. గృహహింస కేసు కు సంబంధించి కౌన్సిలింగ్ కు పిలిచిన సమయంలో ఇక ఇలాంటి ఘటన జరిగింది అని తెలుస్తోంది.


 సదరు వ్యక్తిపై భార్య గృహహింస కేసు పెట్టింది. ఈ క్రమంలోనే ఇదే విషయంపై పోలీస్ స్టేషన్కు పిలిపించి అతని విచారిస్తున్నారూ పోలీసులు. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన యువకుడు తీవ్రమైన దుర్భాషలాడుతూ ఇక పోలీస్ అధికారి పై చేయి చేసుకున్నాడు అంటూ ఏఎస్పీ మధువన్ కుమార్ చెప్పుకొచ్చారు. అయితే అతను మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నాడు అంటూ కుటుంబీకులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు చూపిస్తే తాము పరిగణలోకి తీసుకుంటామని అంటూ అయన చెప్పుకొచ్చారు. ఇక పోలీసులపై దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: