
వాళ్ళు చేసే అల్లరి.. నవ్వులు పూయించే సంభాషణ ఏన్నో స్వీట్ మెమరీస్ మిగులుస్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు స్నేహితులు కాస్తా శృతిమించి ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రశాంతంగా సంతోషంగా ఉన్న వాతావరణాన్ని పాడు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ఇటీవలే కాలంలో కొంతమంది స్నేహితులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. కొన్ని సార్లు ఇలా వీడియోలో స్నేహితులు చేసిన పని చూస్తే నవ్వొస్తుంది. కానీ మరి కొన్నిసార్లు మాత్రం కోపం వస్తుంది అని చెప్పాలి.
ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. వరుడు వధువు ఫోటోలకు ఫోజులు ఇస్తూ వేదిక పైన కూర్చుని ఉన్నారు. ఈ క్రమంలోనే బంధువులు అందరూ కూడా వారి దగ్గరికి చేరుకొని ఆశీర్వచనాలు అందిస్తూ ఫోటోలు దిగుతూ ఉండడం గమనార్హం. అంతలోనే ఇక వరుడి స్నేహితులు స్టేజి మీదికి వచ్చారు. వాళ్ళు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. ఎంతో అందంగా ముస్తాబైన వధూవరులపై స్నో స్ప్రే చేశారు. వారి ముఖాలను కూడా స్నో స్ప్రే తో కప్పేయడం గమనార్హం. వరుడికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో కోపంలో ఏమనాలో తెలియక అలాగే కూర్చుండిపోయాడు. చలనం లేకుండా వరుడు కూర్చోవడం చూస్తుంటేనే అతనికి లోపల ఎంత మండిపోతుందో అర్థమవుతుంది అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.