
అదేంటి కుక్కను చూసి అంతలా భయపడడానికి కారణం ఏముంది అని అనుకుంటున్నారు కదా.. ఇలా ఒక కుక్క వేషధారణ లో కాకుండా ఏకంగా పులి వేషధారణ లో ఉండడం గమనార్హం. దీంతో దాన్ని చూడగానే పులి వస్తుందేమో అని భయంతో పరుగులు తీస్తున్నారు జనాలు.. కానీ తర్వాత అది పులి రూపంలో ఉన్న కుక్క అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అయితే ఒక రైతు ఇక ఇలాంటి వినూత్నమైన ఆలోచన చేశాడు అన్నది మాత్రం తెలుస్తుంది. ఈ ఘటన కర్ణాటకలోని చామరాజ నగర్ లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.
అర్జీపుర అనే ప్రాంతం రాష్ట్ర రహదారి పక్కనే ఉంది. ఇక్కడ రోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి.ఈ క్రమంలోనే అక్కడే ఏకంగా పులి వేషధారణలో ఉన్న ఒక కుక్క రోడ్డుపైకి రావడంతో వాహనదారులందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఏకంగా పక్షులు వన్యప్రాణుల నుంచి పంటను కాపాడేందుకు ఏకంగా తాను పెంచుకునే కుక్కకు పులి చారలను వేసి అచ్చం పులిలా తయారు చేశాడు ఒక రైతు. అయితే ఇక అతని ఆలోచనకు అడవి జంతువులు కోతులు భయపడుతున్నాయో తెలియదు వాహదారులు చుట్టుపక్కల వారు మాత్రం భయంతో ఊగిపోతున్నారు అని చెప్పాలి.